Begin typing your search above and press return to search.
కరోనా కట్టడే లక్ష్యం.. పోలీసులు ఏం చేశారంటే..?
By: Tupaki Desk | 1 Jun 2021 8:30 AM GMTదేశంలో కరోనా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఓ వైపు కేసులు పెరుగుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య మాత్రం తగ్గట్లేదు. దేశంలో గరిష్టంగా నాలుగు లక్షలకు చేరిన ఒకరోజు కేసుల సంఖ్య.. ఇప్పుడు ఒకటిన్నర లక్షలకు పైన నమోదవుతోంది. అయితే.. మరణాలు మాత్రం మూడు వేలకు పైన్నే నమోదవుతున్నాయి. దీంతో.. రాష్ట్రాలు తమ వద్ద పరిస్థితిని బట్టి తగిన చర్యలు తీసుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో 144 సెక్షన్ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నోయిడాలో ఇప్పటి వరకు 62,356 కేసులు నమోదయ్యాయి. ఇందులో రికవరీలు, మరణాలు పోగా.. ప్రస్తుతం 1073 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసుల తీవ్రత పెరగకుండా సర్కారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.
కాగా.. తెలుగు రాష్ట్రాల్లో సైతం లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. జూన్ 10వ తేదీ వరకు ఈ ఉత్తర్వులు కొనసాగుతాయని ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే.. తెలంగాణ సర్కారు మాత్రం సడలింపును పెంచింది. నిన్నటి వరకు 10 గంటల వరకే బయట తిరగడానికి అనుమతి ఉండగా.. నేటి నుంచి మూడు గంటలు పెంచి, మధ్యాహ్నం 1 గంట వరకు దుకాణాలు తెరిచి ఉంచొచ్చని ప్రకటించింది.