Begin typing your search above and press return to search.

ప్రపంచంలో అత్యంత ప్రమాదమైన ఫ్లై ఓవర్లు ఇవే ... !

By:  Tupaki Desk   |   26 Nov 2019 1:30 AM GMT
ప్రపంచంలో అత్యంత ప్రమాదమైన ఫ్లై ఓవర్లు ఇవే ... !
X
ప్రస్తుతం నగరాల్లో రోజు రోజుకి జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. దీని తో ఉన్న స్థలంలోనే అందరికి సౌకర్యవంతమైన , సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ ని అందించాలనే లక్ష్యంతో చాలా దేశాలలో ఫ్లై ఓవర్ల ని నిర్మించారు, అలాగే నిర్మిస్తున్నారు. ఈ ఫ్లై ఓవర్ ల నిర్మాణం ఇటీవల మరింత జోరందుకుంది. ముఖ్యంగా మన హైదరాబాద్ లో. ఇక ఈ మధ్య ఎన్నో అంచనాలతో .. టెక్కీ లకి ఎంతగానో ఉపయోగపడుతుంది అని భావించి గచ్చిబౌలి బయో డైవర్శిటీ జంక్షన్ ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి పూనుకున్నారు. ఆ నిర్మాణం పూర్తి కావడంతో ఈ మద్యే ఫ్లై ఓవర్ ని ప్రారంభించారు.

ఇక తాజాగా ఈ బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ పై జరిగిన ఘోర ప్రమాదం తో అందరి దృష్టి ఇప్పుడు ఫ్లై ఓవర్ల పై పడింది. అసలు ఫ్లై ఓవర్లు ఎంతవరకు పమాదం కాదు అన్న విషయాలపై చర్చలు నడుస్తున్నాయి. అయితే ఫ్లై ఓవర్ పై ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్త వహించినా భారీ మూల్యం చెల్లించక తప్పదు. ముఖ్యంగా ఫ్లై ఓవర్ పై స్పీడ్ ని కంట్రోల్ లో పెట్టుకోవాలి , అలాగే మలుపుల వద్ద టర్న్ చేసేటప్పడు స్పీడ్ తగ్గించి టర్న్ చేయాలి కానీ , మలుపుల వద్ద కూడా అదే స్పీడ్ తో వాహనాలని నడుపుతుండటం తోనే రోజురోజుకి ఫై ఓవర్ల పై పైయాక్సిడెంట్ల సంఖ్య పెరుగుతోంది అని పోలీసులు చెప్తున్నారు.

ఇలా డేంజరస్ టర్నింగ్ పాయింట్ లు , కర్వ్లు, మలుపులు ఉన్న ఫ్లై ఓవర్లు మనదేశంలోనూ, ప్రపంచంలోనూ చాలా ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1. మల్టీ లేయర్ ఫ్లై ఓవర్ : ఈ మల్టీ లేయర్ ఫ్లై ఓవర్ చైనా లోని షాంఘై సిటీకి దగ్గర లో ఉంది. ఈ ఫ్లై ఓవర్ మొత్తం ఆరు వరుసలలో నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ పై వాహనాన్ని నడపాలి అంటే ..కట్టి యుద్ధం లాంటిదే. దీనిపై ప్రయాణం చేసే సమయంలో మనం ఎటు నుండి ఎటు వెళ్తున్నామో కూడా తెలుసుకోవడం చాలా కష్టం. ఆ ఫ్లై ఓవర్ కి బాగా అలవాటు పడిన డ్రైవర్లు కూడా ఒక్కొక్కసారి దారి తప్పుతుంటారని అక్కడి వాహనాల డ్రైవర్లు చెప్తుంటారు. ఇంత గజి బిజిగా ఉండి డ్రైవర్లని సైతం కన్ ఫ్యూజ్ చేసే ఇలాంటి ఫ్లై ఓవర్ ప్రపంచంలోనే ఇంకెక్కడా లేదు అని చాలామంది అంటుంటారు.

2. ఎషిమా ఒహాషీ ఫ్లై ఓవర్ : ఈ ఎషిమా ఒహాషీ ఫ్లై ఓవర్ ని ఫ్లై ఓవర్ అనే కంటే ఒక పెద్ద కొండ అని చెప్తే ..సరిగ్గా సూట్ అవుతుంది. ఎందుకు అంటే ఈ ఫ్లై ఓవర్ ఎక్కడం అంటే కొం డెక్కినట్టే. ఏటవాలుగా ఉండే ఈ ఫ్లై ఓవర్ జపాన్ లో ఉంది. దాదాపు రెండు కి లోమీటర్ల నిడివి ఉండే ఈ ఫ్లై ఓవర్ రెండు నగరాలను (మత్స్యూ–సకైమినటో) కలుపుతుంది. ఫై ఓవర్ ఎక్కితే ఏదో రోలర్ కోస్టర్ ఎక్కినట్టే ఉంటుంది. ఈ ఫ్లై ఓవర్ ఎక్కే టప్పుడు ఒకే స్పీడుతో వెళ్ళాలి ..మధ్యలో బ్రేక్వేయకూడదు…బండి ఆగకూడదు. ఒకవేల పొరపాటున అలా చేస్తే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. ఈ ఎషిమా ఒహాషీ ఫ్లై ఓవర్ ని పంచంలోనే అత్యంత డేంజరస్ ఫ్లై ఓవర్ గా అందరు చెప్తారు.

3 . ఉల్టా దంగా ఫ్లై ఓవర్ : ఈ ఉల్టా దంగా ఫ్లై ఓవర్ కోల్ కత్తా లో ఉంది. ఇది కూడా అనేక మలుపులతో ఉంటుంది. ఇప్పటివరకు ఈ ఫ్లై ఓవర్ పై చాలా యాక్సిడెంట్లు జరిగాయి. అయితే కోల్ కతా ట్రాఫిక్ ను తప్పించుకోవాలంటే ఇక్కడి ప్రజలు ఈ ఫ్లై ఓవర్ ఎక్కక తప్పదు. కాబట్టి ఎన్ని ప్రమాదాలు జరిగిన కూడా ప్రజలు ఈ ఫ్లై ఓవర్ ని వినియోగిస్తున్నారు.

4 . యశ్వంత్ పుర ఫ్లై ఓవర్ : మనదేశంలో ఉండే డేం జరస్ ఫ్లై ఓవర్ లలో ఈ యశ్వంత్ పుర ఫ్లై ఓవర్ కూడా ఒకటి. దీనిపై తరచూ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. దీనితో ఈ ప్రమాదాల్ని నివారించడానికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. మెటల్ రి ఫ్లెక్టర్స్ ను ఏర్పాటు చేశారు. సైన్ బోర్డులు పెట్టారు. మితిమీరిన వేగాన్ని కంట్రోల్ చేయడానికి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవే కాదు మన ప్రపంచం లో మరెన్నో డేంజరస్ ఫ్లై ఓవర్లు ఉన్నాయి.