Begin typing your search above and press return to search.

ఒమిక్రాన్ కన్నా డేంజరస్ వేరియంట్

By:  Tupaki Desk   |   5 Jan 2022 5:37 AM GMT
ఒమిక్రాన్ కన్నా డేంజరస్ వేరియంట్
X
యావత్ ప్రపంచం ఒమిక్రాన్ ధాటికి వణికిపోతుంటే ఫ్రాన్స్ లో ఇంతకన్నా డేంజరస్ వేరియంట్ బయటపడింది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ లోని అంటువ్యాధుల పరిశోధన కేంద్రం నిపుణులు ప్రకటించారు. ఈ డేంజరస్ వేరియంట్ ను ఐహెచ్ యు ( బీ.1.640.2) గా నిపుణులు చెప్పారు. కొత్తగా బయటపడిన వేరియంట్ లో 46 మ్యూటేషన్లు బయటపడినట్లు తెలిపారు. కొత్తగా బయటపడిన వేరియంట్ కు సంబంధించి ఇప్పటికే 12 కేసులు బయటపడ్డాయి. దాంతో డాక్టర్లు, శాస్త్రజ్ఞుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

ఇప్పటికే ఒమిక్రాన్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఒమిక్రాన్ చాలా స్పీడుగా విస్తరించింది. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో రోజుకు లక్షల్లో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ తో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరిగిపోతోంది. ఒకవైపు లక్షల్లో రికార్డవుతున్న కరోనా కేసులు, మరోవైపు పెరిగిపోతున్న ఒమిక్రాన్ కేసులను నియంత్రించలేక ఆయా దేశాలు నానా అవస్థలు పడుతున్నాయి.

అమెరికాలో గడచిన 24 గంటల్లో 11 లక్షల కరోనా కేసులు బయటపడ్డాయి. అలాగే బ్రిటన్ లో 24 గంటల్లో 2.5 లక్షల కేసులు రికార్డయ్యాయి. ఒమిక్రాన్ అయినా ఫ్రాన్స్ లో బయటపడిన కొత్త వేరియంట్ అయినా డేంజరస్ కాదన్న నిర్లక్ష్యంతోనే కొంప ముణిగిపోతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ ను తేలిగ్గా తీసుకుంటే దారుణంగా దెబ్బపడటం ఖాయమంటున్నారు. ఇప్పటికే ఏవైనా అనారోగ్యాలతో ఉన్నవారు, వయసైపోయిన వారిపైన ఈ వేరియంట్లు తీవ్రమైన ప్రభావం చూపటం ఖాయమంటున్నారు.

ఆఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ చాలా స్పీడుగా 130 దేశాలకు విస్తరించింది. ఇంకా చాలా దేశాల్లో బయటపడుతోంది. ఈ కారణంగానే ఆఫ్రికా దేశాల నుండి చాలా దేశాలు విమాన రాకపోకలను బ్యాన్ చేశాయి. ఇపుడు ప్రాన్స్ లో వెలుగుచూసిన కొత్త వేరియంట్ మరే దేశంలోనే బయటపడలేదు. అయితే ఫ్రాన్స్ లో బయటపడిన కొత్త వేరియంట్ తో మిగిలిన దేశాల్లో టెన్షన్ మొదలైపోయింది. మొత్తానికి కొత్త వేరియంట్లు, కొత్త మ్యూటేషన్లు యావత్ ప్రపంచాన్ని కలవర పెట్టేస్తున్నది వాస్తవం.