Begin typing your search above and press return to search.
కరోనా నుండి కోలుకున్న ప్రముఖ ఆటగాడు..కరోనా గురించి ఏంచెప్పాడంటే!
By: Tupaki Desk | 28 March 2020 9:50 AM GMTప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డ వారి సంఖ్య లక్షల్లో ఉంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా ఆరు లక్షల మంది కరోనా భారిన పడగా..దాదాపుగా మరణాల సంఖ్య 30 వేలకి చేరువలో ఉంది. ఇక ఆ మరణాల సంఖ్యలో ఇటలీలో తీవ్రంగా ఉంది. ఇటలీ లో ఇప్పటివరకు 9,134 మంది కరోనా తో మరణించగా ..ఆ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ పోతుండటంతో అందరిలో భయం మొదలైంది.
కాగా , ఈ మహమ్మారి భారిన పడి కోలుకున్న వారిలో డైబలా ఒకరు. ఇటలీ దేశ ప్రొషెషనల్ అసోసియేషన్ ఫుట్‌బాల్ క్లబ్ జట్లలో ఒకటైన జువెన్‌టస్ జట్టు సభ్యుడు, అర్జెంటీనా ఆటగాడు. ఈ క్లబ్ తరఫున ఆడే ఆటగాళ్లలో డానియెల్ రుగాని, బ్లాసి మాటుడిలో కరోనా వైరస్ భారిన పడ్డారు. ఈ వైరస్ నుండి కోలుకున్న తరువాత, కరోనా వైరస్ తనను ఎంతలా బాధించిందనే అనుభవాలను డైబలా పంచుకున్నాడు.
నేను ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటున్నా. కరోనా నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. చాలా రోజుల క్రితం నా ఆరోగ్యం బాలేదు. నడవడం చాలా కష్టమనిపించేది. ఐదు నిమిషాలు నడిచిన తర్వాత తప్పకుండా ఆగాల్సి వచ్చేది. ఊపిరి తీసుకో లేకపోయే వాడిని. నరకం అంటే ఏమిటో చూశా. ప్రస్తుతం కాస్త నడవ కలుగుతున్నా. గత కొన్నిరోజుల క్రితం నడిస్తే షేక్ అయ్యే వాడిని. ఇప్పుడు ఆ పరిస్థితిని అధిగమించడానికి యత్నిస్తున్నా. ప్రస్తుతం బాగానే ఉన్నా. కాకపోతే కోలుకోవడానికి చాలా సమయం పట్టొచ్చు. కరోనా బారిన పడిన నా కాబోయే భాగస్వామి ఒరియానా కూడా కోలుకుంటుంది అని డైబలా చెప్పుకొచ్చాడు.