Begin typing your search above and press return to search.
రేప్ చేస్తున్నా దాన్ని వాడితే అక్కడ నేరం!
By: Tupaki Desk | 29 Jan 2016 10:30 PM GMTకొన్ని దేశాల్లో చట్టాలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఇలాంటి విచిత్ర చట్టాలు వెనుకబడిన దేశాల్లో ఉండటాన్ని కాస్త అర్థం చేసుకోవచ్చు. కానీ.. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండటం విస్మయంగా అనిపించక మానదు. అలాంటి ఘటనే డెన్మార్క్‌లో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఉదంతాన్ని చూస్తే.. ఈ చట్టాలేంటిరా బాబు అనిపించక మానదు.
డెన్మార్క్ లోని సోండెర్ బర్గ్ ప్రాంతంలో ఒక యువతి రాత్రివేళ ఒక్కతే నడుచుకుంటూ వెళుతోంది. ఈ క్రమంలో ఒక ఆగంతకుడు సదరు యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. యువతిని కిందపడేసి ఆమె స్కర్ట్ ను తొలగించే ప్రయత్నం చేశాడు.
ఈ సమయంలో తనను తాను కాపాడుకోవటానికి వీలుగా తనపై రేప్ కు పాల్పడుతున్న వ్యక్తిపై పెప్పర్ స్ప్రే ప్రయోగించింది. అనంతరం అతడి బారి నుంచి తప్పించుకుంది. తనను రేప్ చేయటానికి ప్రయత్నించిన వ్యక్తిపై ఫిర్యాదు చేయటానికి వెళ్లిన బాధితురాలికి అక్కడి పోలీసుల ప్రవర్తన షాకింగ్ గా మారింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదును పక్కన పెట్టి.. ఆగంతకుడిపై పెప్పర్ స్ర్పే వాడినందుకు ఎదురు కేసు పెట్టారట. అదేమంటే.. డెన్మార్క్ చట్టాల ప్రకారం.. ఎట్టి పరిస్థితుల్లోనూ పెప్పర్ స్ర్పే వాడకూడదన్న విషయాన్ని మర్చిపోయావా? అని అడుగుతున్నారట.
చట్టాన్ని ఉల్లంఘించిన బాధిత యువతికి కోర్టులో రూ.50వేలు (మన రూపాయిల్లో) ఫైన్ వేశారట. రేప్ నుంచి తప్పించుకున్న ఆమె.. డెన్మార్క్ పోలీసులు.. కోర్టు తీర్పుతో షాక్ తింది. బాధిత యువతే కాదు.. ఇలాంటి విచిత్ర చట్టం గురించి విన్న వాళ్లంతా షాక్ అయ్యే పరిస్థితి.