Begin typing your search above and press return to search.

చంద్రబాబు సభకు రాకపోవడానికి కారణమదేనా?

By:  Tupaki Desk   |   27 Jan 2020 11:03 AM GMT
చంద్రబాబు సభకు రాకపోవడానికి కారణమదేనా?
X
ఏపీకి 3 రాజధానుల బిల్లు, అంతకుముందు ఇంగ్లీష్ మీడియం బిల్లులు - ఎస్సీ - ఎస్టీ బిల్లు - సీఆర్డీఏ రద్దు బిల్లు.. ఇలా అన్ని బిల్లులపై అసెంబ్లీలో తన వాదన వినిపించిన చంద్రబాబు సడన్ గా ఈరోజు సోమవారం ఏపీ శాసనమండలి రద్దు బిల్లుకు మాత్రం సభలో లేకుండా పోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

సభలో రచ్చ చేసి.. ఆవేదన చెంది చిత్రవిచిత్రమైన వేషాలతో మీడియాలో హైలెట్ కావడాన్ని ఇష్టపడే చంద్రబాబు ఈరోజు అసెంబ్లీకి ఎందుకు రాలేదు చెప్మా అని వైసీపీ - టీడీపీ నేతలు కూడా సమాలోచనలు జరుపుతున్నారు. అయితే దీనికి అసలు కారణాన్ని నిండు అసెంబ్లీలో చెప్పి ఆశ్చర్యపరిచారు వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ రావు.

నాడు వైఎస్ హయాంలో సీఎంగా రాజశేఖర్ రెడ్డి రద్దైన మండలిని పునరుద్దరించారు. మండలి పునప్రారంభం సందర్భంగా అప్పటి ఇదే ప్రతిపక్ష నేత చంద్రబాబు కారాలు మిరియాలు నూరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్ణయాన్ని తప్పు పట్టారు. మండలిని రద్దు చేయాలని.. దీనివల్ల ప్రజాధనం వృథా అని.. ప్రపంచవ్యాప్తంగా దేశంలోని రాష్ట్రాలన్ని వ్యతిరేకిస్తున్న మండలిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేవలం రాజకీయ నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేశారని పెద్ద లెక్చర్ ఇచ్చారు.

ప్రస్తుతం మండలి రద్దు నిర్ణయాన్ని తీసుకున్న వైసీపీ నాటి చంద్రబాబు వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించింది. అప్పుడు రద్దు చేయమని.. ఇప్పుడు వద్దు అంటున్న చంద్రబాబును ఇదే వీడియో చూపించి అసెంబ్లీలో ఇరుకునపెట్టాలని స్కెచ్ గీసిందట.. ఈ విషయం లీకయ్యే చంద్రబాబు అసెంబ్లీకి రాలేదని.. ముఖం చాటేశారని తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ రావు తెలిపారు.

మండలి అవసరం లేదన్న చంద్రబాబు వ్యాఖ్యలను ప్రశ్నిస్తారనే భయంతోనే సభలో చర్చకు రాలేదని ధర్మాన అసలు విషయాన్ని చెప్పడంతో సభలో బాబు గైర్హాజరిపై అసలు నిజం అందరికీ తెలిసివచ్చింది.