Begin typing your search above and press return to search.

కిరాణా సామానూ కొనలేరు.. వెస్టిండీస్ దుస్థితిపై ఆ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   2 Nov 2022 1:30 PM GMT
కిరాణా సామానూ కొనలేరు.. వెస్టిండీస్ దుస్థితిపై ఆ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
X
వెస్టిండీస్.. ప్రపంచంలోనే రెండు సార్లు టీ20 కప్ గెలిచిన ఏకైక జట్టు. ఈసారి క్వాలిఫైయింగ్ మ్యాచ్ లోనే దారుణంగా ఓడి ఇంటిదారి పట్టింది. దీంతో వెస్టిండీస్ జట్టుపై ఇంటా బయటా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఓటములకు కారణం వెస్టిండీస్ బోర్డు అని.. ఆ బోర్డు తీరుపై ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 2012 -2016 టీ20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ డారెన్ సామీ తాజాగా మాట్లాడుతూ వెస్టిండీస్ ఆటగాళ్లకు ఆటపై ప్రేమకు వారికి ఇచ్చే మొత్తం కిరాణా సామాగ్రిని కూడా కొనుగోలు చేయదని... ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ బోర్డుల మధ్య వేతన వ్యత్యాసాల నేపథ్యంలో వెస్టిండీస్ బోర్డు దారుణంగా జీతాలు ఇస్తోందని సామీ విమర్శలు కురిపించారు.

వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్ల మధ్య వేతన వ్యత్యాసాల గురించి మాట్లాడుతూ ఆటపై ప్రేమ వెస్టిండీస్ ఆటగాళ్లకు సూపర్ మార్కెట్ నుండి కిరాణా సామాగ్రిని కొనుగోలు చేయదని సామీ అన్నారు. "ప్రేమ కోసం ఆడుకునే రోజులు పోయాయి. ప్రేమ మీకు సూపర్ మార్కెట్ నుండి కిరాణా సామాను కొనదు"అన్నాడు సామీ. వెస్టిండీస్ ఆటగాళ్ల కంటే భారత్‌లోని ఆటగాళ్లు ఎక్కువ సంపాదిస్తున్నందున టీమ్ ఇండియా బలంగా ఉందని అతను చెప్పాడు.

"భారతదేశం బలంగా ఉంది. ఎందుకంటే మీరు మరెక్కడా ఆడవద్దని వారు తమ ఆటగాళ్లకు చెప్పగలరు. బ్యాకప్ చేయడానికి వారి వద్ద డబ్బు ఉందని మీరు అర్థం చేసుకోవాలి" అని సామీ తెలిపారు. భారత్ జట్టు ఏ జాబితా కాంట్రాక్ట్ సంవత్సరానికి ఒక మిలియన్ డాలర్లు చెల్లిస్తుందని, అయితే వెస్టిండీస్ ఆటగాడు ఆ డబ్బులో కొంత భాగాన్ని మాత్రమే సంపాదిస్తాడని సామీ చెప్పాడు.

"విండీస్ ఏ లిస్ట్ ఆటగాడితో పోల్చితే, భారతదేశం ఏ జాబితాలో కాంట్రాక్ట్ పొందిన ఆటగాడు సంవత్సరానికి ఒక మిలియన్ డాలర్లు (రూ. 7 కోట్లు ప్లస్ మ్యాచ్ ఫీజులు మరియు టీవీ హక్కుల డబ్బు) సంపాదించవచ్చు, కానీ వెస్టిండీస్ ఆటగాళ్లు 150,000 డాలర్లు (సుమారుగా రూ. 1.2 కోట్లు) సంపాదించగలడు" అని సామీ చెప్పాడు. 38 ఏళ్ల సామీ ప్రైవేట్ లీగ్‌లలో ఆడినందుకు చిన్న బోర్డులు తమ ఆటగాళ్లను ఉంచుకోవడం చాలా కష్టమని చెప్పాడు.

"ఇది చాలా పెద్ద వ్యత్యాసం.. స్పష్టంగా చెల్లింపుల్లో అసమానత కనిపిస్తోంది. చిన్న బోర్డులు ఆర్థిక శక్తి పరంగా తమ ఆటగాళ్లను వేరే చోట చక్కగా చెల్లింపులు చేసినప్పుడు వెస్టిండీస్ అలా ఎందుకు చేయడం లేదని ” సామీ ప్రశ్నించారు.

న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వారి ఆటగాళ్లు.. షెడ్యూల్‌లను నిర్వహించే విధానానికి సామీ ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్ కోసం ఆడేందుకు న్యూజిలాండ్ యాజమాన్యం తమ ఆటగాళ్లకు ఆ టైంలో మ్యాచ్ లే పెట్టదని అన్నారు. చాలా బాగా వాళ్లు చేస్తారని అన్నారు. వర్కింగ్ సిస్టమ్‌ను పొందడం ఆటగాళ్లు , బోర్డులపై ఆధారపడి ఉంటుంది” అని సామీ అన్నారు.

ఐర్లాండ్ -స్కాట్లాండ్‌లతో జరిగిన మ్యాచ్‌లలో ఓడిపోయిన వెస్టిండీస్ ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ నుండి సూపర్-12 దశకు కూడా చేరుకోలేకపోయింది. ఈ క్రమంలోనే సామీ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.