Begin typing your search above and press return to search.
ఆ చిన్నారి.. ఇకలేడు!
By: Tupaki Desk | 26 Nov 2022 7:43 AM GMTవిద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ముక్కుపచ్చలారని పసివాడి ప్రాణాలను తీసింది. మూడేళ్ల చిన్నారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. తమ డాబా పైగా కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగలు వెళ్తున్నాయని.. వాటిని తొలగించండని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఆ పసివాడి పాలిట మృత్యుశాపమై నిలిచింది.
విద్యుదాఘాతానికి గురై 14 రోజులపాటు మృత్యువుతో పోరాడిన దర్శిత్ (3) కన్నుమూశాడు. విషాదం నింపిన ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టకు చెందిన జొన్నకూటి వినోద్, చాందినిలకు ఇద్దరు కుమారులు సంతానం. ఈ నేపథ్యంలో చాందిని తమ డాబాపై నవంబర్ 12న డాబాపై దుస్తులు ఆరేయడానికి పైకి వెళ్లింది. ఆమెతోపాటు మూడేళ్ల చిన్న కుమారుడు దర్శిత్ కూడా వెళ్లాడు.
ఈ క్రమంలో డాబా పైనుంచి 33 కేవీ విద్యుత్తు తీగలు వెళ్తుండడంతో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా... వైద్యులు మోకాలి కింద వరకు రెండు కాళ్లూ తొలగించారు.
బాలుడి దీనావస్థపై ఒక పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన దేశవిదేశాల్లోని దాతలు రూ.40 లక్షల విరాళాలు అందించారు. దర్శిత్ కోలుకోవాలని అందరూ ఆకాంక్షించారు.
ఈ నేపథ్యంలో దర్శిత్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో ఐసీయూకి తరలించారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. కుడికాలికి ఇన్ఫెక్షన్ తగ్గకపోవడంతో మరోసారి ఆపరేషన్ చేసి మోకాలి పైవరకు తొలగించారు. అంతా సక్రమంగా ఉండడంతో వార్డుకు తరలించారు. మళ్లీ గుండె కొట్టుకోవడం మందగించడంతో దర్శిత్ కన్నుమూసి తీరని శోకాన్ని మిగిల్చాడు.
మూడేళ్ల తమ చిన్నారి అనుకోని ప్రమాదానికి గురై కాళ్లు తొలగిస్తే ప్రాణాలు అయినా దక్కాయని కాస్త ఊరట చెందారు. బతికి వస్తే చాలు అదే పదివేలు అనుకున్నారు. కానీ ఆ తల్లిదండ్రుల ఆశలు నెరవేరకపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. అధికారుల నిర్లక్ష్యానికి తమ బిడ్డ బలౖయె పోయాడంటూ వారు విలపిస్తున్న తీరు చూపరులను సైతం కంట తడి పెట్టించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.