Begin typing your search above and press return to search.
వైసీపీలోకి దాసరి!..బెజవాడఎంపీగా పోటీ!
By: Tupaki Desk | 15 Feb 2019 11:02 AM GMTఏపీ అసెంబ్లీ ఎన్నికలకు గడువు ముంచుకొస్తున్న వేళ... అధికార పార్టీ టీడీపీలో నైరాశ్యం స్పష్టంగా గోచరిస్తుంటే.... విపక్షం వైసీపీలో మాత్రం ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు - ఓ ఎంపీ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరగా... మరింత మంది టీడీపీ నేతలు వైసీపీ బాట పడుతున్నారని ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన ఓ బడా పారిశ్రామికవేత్త ఇప్పుడు వైసీపీలో చేరిపోతున్నారు. అంతేకాకుండా విజయవాడ ఎంపీ సీటును వైసీపీ అధిష్ఠానం ఆయనకే దాదాపుగా ఖరారు చేసిందన్న వార్తలు కూడా ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి. ఆ బడా పారిశ్రామికవేత్త ఎవరన్న విషయానికి వస్తే... హైదరాబాద్ కేంద్రంగా నగర శివారులో ఉన్న బడా కంపెనీ విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జై రమేశ్... చాలా కాలం నుంచి టీడీపీలోనే ఉన్నారు. అయితే ఏనాడూ ఆయన బహిరంగంగా టీడీపీ కార్యక్రమాల్లో పాలుపంచుకున్న దాఖలా లేదు.
ఏదో పార్టీలో ఉన్నానంటే ఉన్నానన్న రీతిలో సాగిన ఆయన ఇటీవలి కాలంలో రాజకీయంగా యాక్టివేట్ కావాలని నిర్ణయించుకున్నారట. అనుకున్నదే తడవుగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆయన... తన సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి - ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును అప్రోచ్ అయ్యారు. తాను వైసీపీలో చేరాలనుకుంటున్నానని - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మీరే మాట్లాడాలని కోరారు. దీనికి సరేనన్న దగ్గుబాటి... విషయాన్ని జగన్ కు చేరవేశారట. ఈ క్రమంలో విజయవాడ పార్లమెంటు స్థానానికి ఇప్పటిదాకా ఏ ఒక్క అభ్యర్థిని ఖరారు చేయని జగన్... జై రమేశ్ అయితే ఎలాగుంటుందని ఆలోచించారట. అయితే ఈ స్థానం కోసం ఇప్పటికే తన వద్ద ఉన్న ప్రతిపాదనలను కూడా జగన్ ఓ సారి తిప్పేశారట. కమ్మ సామాజిక వర్గానికే చెందిన మరో ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ వైసీపీ సిగ్నల్స్ కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నారు. అయితే ప్రస్తుతం విజయవాడ ఎంపీగా ఉన్న టీడీపీ నేత కేశినేని నానిని ఓడించే దమ్ము పీవీపీకి లేదన్న కారణంతో జగన్ ఇప్పటిదాకా ఏమాటా చెప్పలేదట.
ఇదే సమయంలో జైరమేశ్ నుంచి ప్రతిపాదన రాగానే.. దానిపై చాలా త్వరగానే స్పందించిన జగన్... ఆయన ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. విజయవాడ ఎంపీ సీటు ఇచ్చేందుకు కూడా జగన్ ఓకే చెప్పేశారట. ఇంకేముంది... నేటి సాయంత్రం ఆయన హైదరాబాద్ లో జగన్ తో భేటీ అయ్యి వైసీపీలో లాంఛనంగా చేరిపోవడానికి రంగం సిద్ధమైంది. జై రమేశ్ కు జనాలతో మంచి టచ్ లేనప్పటికీ... ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండగా నిలుస్తున్న ఆయన వైఖరి పార్టీకి బాగానే పనికి వస్తుందన్నది జగన్ భావనగా తెలుస్తోంది. జై రమేశ్ వైసీపీలో చేరిపోతే... టీడీపీకి నిజంగానే భారీ దెబ్బేనని చెప్పక తప్పదు. ఎందుకంటే... జై రమేశ్ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు గానీ... ఆయన స్థాపించిన విజయ్ ఎలక్ట్రికల్స్ గురించి తెలియని వారు ఉండరు. ఇండస్ట్రియల్ వర్గాల్లో బడా వ్యక్తిగా పేరొందిన జై రమేశ్ లాంటి వ్యక్తులు చేజారితే... ఏ పార్టీకి అయినా ఇబ్బందే కదా.