Begin typing your search above and press return to search.
కోల్ స్కాంలో దాసరికి బిగ్ రిలీఫ్
By: Tupaki Desk | 11 Nov 2016 9:32 AM GMTకేంద్ర మాజీ బొగ్గు గనుల శాఖా మంత్రి దాసరి నారాయణరావుకు బొగ్గు కుంభకోణం నుంచి పెద్ద ఊరట లభించింది. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో దాసరి కేంద్ర బొగ్గు గనుల శాఖా సహాయమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాదని..తనకు అనుకూలంగా ఉన్న వారికి బొగ్గు గనులు కేటాయించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
ఛత్తీస్ ఘడ్ లోని ఈ బొగ్గు గనుల నుంచి జిందాల్ గ్రూప్‌నకు నిబంధనలకు విరుద్ధంగా బొగ్గు గనులు కేటాయించారన్న ఆరోపణలు దాసరిపై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జేఎల్ డీ యవాత్ మల్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ దాసరిని కూడా ఈ కేసులో ముద్దాయిగా చేర్చాలని వేసిన పిటిషన్ ను స్పెషల్ సీబీఐ కోర్టు రిజెక్ట్ చేసింది. దాసరి నిబంధనలకు అనుగుణంగా ఈ కేటాయింపులు చేశారని కూడా స్పష్టం చేసింది.
ఇక ఈ కేసు పూర్వాపరాలు చూస్తే గతంలో కూడా ఇదే అంశంపై స్పందించిన దాసరి ఈ విషయంలో తనకు సంబంధం లేదని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దే పూర్తి బాధ్యత అని కుండబద్దలు కొట్టారు. జిందాల్ గ్రూప్ నకు బొగ్గు గనుల కేటాయింపులో తన ప్రేమయం లేదని... అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగే వీటిని కేటాయించారని సీబీఐ కోర్టులో లిఖితపూర్వకంగా కూడా అఫిడవిట్ దాఖలు చేశారు. ఇక బొగ్గు కుంభకోణంలో మన్మోహన్ సింగ్ ను నిందితుడిగా చేర్చాలంటూ మధుకోడా చేసిన వాదనను కూడా దాసరి సమర్థించారు.
దాసరి బొగ్గు శాఖ సహాయ మంత్రిగా ఉన్న సమయంలోనే జిందాల్ తప్పుడు సమాచారం ఇచ్చి గనులు దక్కించుకుందనే ఆరోపణలు వచ్చాయి. కోల్ గేట్ స్కాంలో దాసరి నారాయణరావుతో పాటు మొత్తం 14 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా - పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ - బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి ఎస్సీ గుప్తాల్ పై సీబీఐ అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దాసరికి అంటిన ఈ బొగ్గు మసిపై తాజా సంఘటన ఆయనకు పెద్ద ఊరటే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/