Begin typing your search above and press return to search.
దర్శకరత్న దాసరి కన్నుమూత
By: Tupaki Desk | 30 May 2017 2:38 PM GMTతెలుగు సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు దాసరి నారాయణరావు (75) కిమ్స్ ఆస్పత్రిలో చిత్సపొందుతూ కన్నుమూశారు. జనవరిలో జరిగిన శస్త్రచికిత్స అనంతరం ఇన్‌ఫెక్షన్ సోకడంతో తీవ్ర అస్వస్థతకు లోనైన దాసరి, 4 రోజుల క్రితం మరోసారి కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. హై బీపీతో బాధపడుతున్న దాసరికి వైద్యులు చికిత్స కొనసాగిస్తుండగా..దాసరి కన్నుమూశారు.
డా. దాసరి నారాయణరావు రచయిత, దర్శకుడు, నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. అనంతరం రాజకీయాల్లో సైతం తన సేవలను కొనసాగించారు. కేంద్రమంత్రిగా పనిచేశారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డుకెక్కారు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో 1947, మే 4న దాసరి జన్మించాడు. బీ.ఏ డిగ్రీలో దాసరి పట్టబధ్రుడు. కాలేజీ రోజుల్లోనే దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవాడు. చాలా తక్కువ కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడి గా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపును తెచ్చకున్నారు. ఎంతో మంది కొత్త కళాకారులను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. దాసరి చేతుల మీదుగా పరిశ్రమలో అడుగు పెట్టినవారు చాలా మంది స్టార్‌లుగా ఎదిగారు. దాసరికి అభిమానులు కూడా ఎక్కువే. 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి.
దాసరి మొదటి తాతామనవడు(1972). స్వర్గం నరకం - మేఘసందేశం - మామగారు సినిమాలు దాసరికి మంచి పేరు తెచ్చాయి. విజయశాంతితో తీసిన ఒసేయ్ రాములమ్మ అప్పట్లో ఓక ఊపు ఊపింది. దాసరి సినిమాలు స్త్రీ ప్రధాన పాత్రలతో తీసేవారు. సమాజంలోని పలు సమస్యలపై సందేశాత్మక చిత్రాలకు దాసరి దర్శకత్వం వహించి నిర్మించారు . దాసరి తీసిన బొబ్బిలి పులి - సర్దార్ పాపరాయుడు సినిమాలు ఓ ప్రభంజనం సృష్టించాయి. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి ఈ సినిమాలు ఎంతోగానో ఉపయోగపడ్డాయి. మామగారు - సూరిగాడు సినిమాలు ఆయన నటనా ప్రతిభకు నిదర్శనం.
తాతామనవడు చిత్రంతో దర్శకుడిగా మారిన దాసరి తొలిచిత్రంతోనే సంచలనం సృష్టించారు. ఎన్టీఆర్ సినీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన ఎన్నో చిత్రాలకు దాసరి దర్శకత్వం వహించారు. మామగారు - సూరిగాడు - అమ్మ రాజీనామా - ఒసేయ్ రాములమ్మ - మేస్త్రీ - ఎర్రబస్సు లాంటి చిత్రాల్లో నటించారు. మజ్ను - అమ్మరాజీనామా - సూరిగాడు - ఓసేయ్ రాములమ్మ - ఓరేయ్ రిక్షా - బలిపీఠం - మనుషులంతా ఒక్కటే - తూర్పుపడమర - చిల్లరకొట్టు చిట్టెమ్మ - కటకటాల రుద్రయ్య - గోరింటాకు - శివరంజని - నీడ - రంగూన్ రౌడీ - సర్దార్ పాపారాయుడు - ప్రేమాభిషేకం - శ్రీవారి ముచ్చట్లు - బొబ్బిలిపులి - మేఘ సందేశం - తాండ్రపాపారాయుడు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడిగా దాసరి చివరిగా ఎర్రబస్సు సినిమాలో నటించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/