Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో.. దసరా ఉత్సవాల్ని అడ్డుకున్నారట!

By:  Tupaki Desk   |   10 Oct 2019 5:43 AM GMT
వైరల్ వీడియో.. దసరా ఉత్సవాల్ని అడ్డుకున్నారట!
X
వైరల్ వీడియో ఒకటి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దసరా సందర్భంగా నిర్వహించే దుర్గమ్మ నిమజ్జన కార్యక్రమాన్ని చిత్రమైన కారణాన్ని చూపించి.. ఒక గ్రామంలోని గ్రామస్తులు అడ్డుకున్న వైనంపై విస్మయం వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే..

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాడూరు పరిధిలోని రాయగొప్ప గ్రామానికి చెందిన వారు దసరా సందర్భంగా దుర్గామాత విగ్రహాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి.. నవరాత్రులు నిర్వహించారు. దసరా అనంతరం.. విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేసేందుకు ఊరేగింపు కార్య్రమాన్ని చేపట్టారు. అయితే.. ఈ ఊరేగింపు గ్రామంలోని ఒక ప్రాంతంలోని స్థానికులు ఆపేశారట.

తమ ప్రాంతంలో వంద శాతం క్రిస్టియన్లు ఉన్నారని.. అదంతా క్రిస్టియన్ల ఏరియా కావటంతో నిమజ్జనం చేయటానికి వీల్లేదని పేర్కొన్నారట. దీంతో.. గ్రామంలో వివాదం చోటు చేసుకొని ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

39 సెకన్ల నిడివి ఉన్న ఈ చిట్టి వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. సాహ జియో పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో దీన్ని పోస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన వ్యక్తి దీన్ని పోస్ట్ చేయటం.. ఇదిప్పుడు వైరల్ గా మారింది. అయితే.. ఇందులో నిజం ఎంతన్నది చెక్ చేయాల్సిన అవసరం ఉందన్న మాటను కొందరు చెబుతుంటే.. జరిగిన ఘటనను పలువురు తప్పు పడుతున్నారు. ప్రభుత్వం ఈ అంశం మీద జోక్యం చేసుకొని.. ఏం జరిగిందన్న విషయంపై క్లారిటీ ఇస్తే మంచిదంటున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి