Begin typing your search above and press return to search.
బీజేపీకి షాక్ లగా.. మళ్లీ సొంత గూటికి దాసోజు శ్రవణ్.. మునుగోడు వేళ షాక్
By: Tupaki Desk | 21 Oct 2022 7:43 AM GMTఅటు తిరిగి.. ఇటు తిరిగి చివరకు సొంత గూటికే చేరుకున్నాడు సీనియర్ తెలంగాణ నేత దాసోజు శ్రవణ్. మునుగోడు ఉప ఎన్నికల వేళ బీజేపీకి షాకిస్తూ తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. టీఆర్ఎస్ లోనే ఉద్యమకారుడిగా రాజకీయం మొదలుపెట్టిన శ్రవణ్ తిరిగి.. కాంగ్రెస్, బీజేపీలో చేరి అనంతరం మళ్లీ టీఆర్ఎస్ లోకే తిరిగి రావడం విశేషం. మునుగోడు ఉప ఎన్నికల వేళ బీజేపీ తరుఫున బలంగా వాయిస్ వినిపిస్తున్న శ్రవణ్.. ఆ పార్టీకి షాకిస్తూ టీఆర్ఎస్ లో చేరడం విశేషం.
ఇవాళ సాయంత్రం మంత్రి కేటీఆర్ సమక్షంలో దాసోజు శ్రవణ్ గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మధ్యనే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు శ్రవణ్. కనీసం రెండు నెలలు కాకముందే ఆయన మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల మునుగోడు సీటు కోసం భువనగిరి మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత బూర నర్సయ్య గౌడ్ ఎంతో ప్రయత్నించారు. ఆ సీటు ఇవ్వకపోవడంతో ఆయన రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇప్పుడు భువనగిరి ఎంపీ సీటు కోసమే శ్రవణ్ టీఆర్ఎస్ లో చేరినట్టు తెలుస్తోంది. బూరనర్సయ్య గౌడ్ స్థానంలో శ్రవణ్ కు ఆ సీటు హామీపైనే ఆయన గులాబీ పార్టీలో చేరడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో దాసోజు శ్రవణ్ ఉస్మానియా విద్యార్థులతో కలిసి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఖైరతాబాద్ సీటు ఆశించారు. కానీ దక్కకపోవడం.. వేరే సీటు ఇస్తే గెలవకపోవడంతో మనస్థాపం చెందిన కాంగ్రెస్ లోచేరారు.
ఇక కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి రాజకీయాలను తట్టుకోలేక విమర్శలు గుప్పిస్తూ ఇటీవలే బీజేపీలో చేరారు. ఇప్పుడు అందులోనూ ఇమడలేక మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరారు. భువనగిరి ఎంపీ సీటు హామీతోనే శ్రవణ్ మళ్లీ సొంత గూటికి వచ్చినట్టు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.