Begin typing your search above and press return to search.
దాసోజు.. కుట్ర వెతికితే వస్తున్న రిజల్ట్ ఇది
By: Tupaki Desk | 12 Feb 2018 8:04 AM GMTజీవితంలో గూగుల్ కున్న ప్రాధాన్యతను తక్కువ చేయలేం. అలా అని గూగులే జీవితమని చెప్పలేం కూడా. అయినా.. గూగుల్ ఏం చెబితే అదే న్యాయమైనట్లు.. అదే ధర్మమన్నట్లుగా మాటలు చెప్పే నేతల తీరు చూస్తే ఫన్నీగా ఉంటుందని చెప్పాలి. మీడియాను ఆకర్షించాలన్న ఉద్దేశమే తప్పించి.. లాజిక్ మిస్ అవుతున్న కాంగ్రెస్ నేతల తహతహ చూస్తే.. వారి బాధ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్ లను ఉద్దేశించి ఎన్నేసి విమర్శలు.. ఆరోపణలు చేసినా మీడియాలో వస్తున్న వార్తల సైజు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు తెగ ఇబ్బందిగా మారింది. దీంతో.. మీడియాను మరింతగా ఆకర్షించేందుకు వీలుగా ఇప్పుడు సరికొత్తగా ఆలోచించే బ్యాచ్ ఒకటి తయారైంది. అలాంటి వారికి టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ కీలకంగా మారారు. ఐటీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న శ్రవణ్ ఇప్పుడు కేటీఆర్ ను టార్గెట్ చేశారు.
ఆయన్ను సరికొత్తగా టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్న ఆయన.. గూగుల్ లో కుట్ర అని ఇంగ్లిషులో టైప్ చేస్తే కేటీఆర్ ఫోటో వస్తుందని చెప్పటమే కాదు.. కుట్రకు పర్యాయపదంగా కేటీఆర్ నిలిచారంటూ తప్పు పడుతున్నారు. దాసోజు చెప్పినట్లుగా.. కుట్ర అని గూగుల్ లో సెర్చ్ చేస్తే వస్తున్న ఫోటోలు చూసినప్పుడు కేటీఆర్ ఎక్కడో అట్టడుగున కనిపిస్తే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో ముందు వరుసలో కనిపించటం గమనార్హం.
అయితే.. బాబును పట్టించుకోని దాసోజు.. పేజీ చివర్లో కనిపిస్తున్న కేటీఆర్ ఫోటో గురించి ప్రముఖంగా చెప్పటం విశేషం. గూగుల్ రిజల్ట్ తో పత్రికల్లో ప్రముఖంగా కనిపించాలన్న దాసోజు ఐడియా వర్క్ వుట్ అయినా.. తాజాగా మాత్రం.. కుట్ర (kutra) అని ఇంగ్లిషులో టైప్ చేస్తే చంద్రబాబు.. కేటీఆర్ తో పాటు.. మరికొందరు మోడళ్ల ఫోటోలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో "కుట్ర" అని తెలుగులో టైప్ చేస్తే మాత్రం కేటీఆర్ మొదలుకొని పవన్‌కల్యాణ్.. ప్రభాస్.. హరీశ్ రావు లాంటి చాలామంది ఫోటోలు వస్తున్నాయి. ఇక.. జాతీయస్థాయిలో చూస్తే ప్రధాని మోడీ.. బీజేపీ కురువృద్ధుడు అద్వానీ ఫోటోలు కూడా వస్తున్నాయి. ఇలా అందరి ఫోటోలు వస్తున్న వేళ.. కుట్రకు కేటీఆర్‌ను బాధ్యుడ్ని చేయటం బాగోలేదు శ్రవణ్ భయ్.