Begin typing your search above and press return to search.
గులాబీ నేతలకు ఆ వ్యాధి ఉందంటున్న శ్రవణ్
By: Tupaki Desk | 1 May 2018 5:14 AM GMTఒకప్పటి అరవీర పవన్ శిష్యుడు.. కాలక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం తెలిసిందే. విషయం ఏదైనా.. అంకెల్ని చూపిస్తూ క్లాస్ పీకటం.. లాజిక్ క్వశ్చన్లతో అందరి దృష్టి తన మీద పడేలా చేయటంలో తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతున్నారనే చెప్పాలి. ప్రాజెక్టుల గురించి కేసీఆర్ ఎంత పాజిటివ్‌గా చెబుతారో.. అంతే నెగిటివ్ గా దాసోజు శ్రవణ్ నోటి నుంచి మాటలు రావటం తెలిసిందే.
కేసీఆర్ చేసే వ్యాఖ్యలకు ఎప్పటికప్పుడు ధీటైన కౌంటర్ ఇచ్చేందుకు తెగ ఉత్సాహపడిపోయే దాసోజ్ శ్రవణ్ తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుకొని.. గులాబీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమకు హిస్టీరియా ఉందంటూ గులాబీ నేతలు చేస్తున్న విమర్శల్ని తిప్పి కొట్టే ప్రయత్నంలో ఆసక్తికర వాదనను వినిపించారు దాసోజు.
తమకు హిస్టీరియా ఉందని చెప్పే గులాబీ నేతలకు స్కిజోఫ్రీనియా ఉందని చెప్పారు. ఇంతకీ ఈ వ్యాధి లక్షణం ఏమిటంటారా? చేయనిది చేసినట్లుగా.. జరగనిది జరిగినట్లుగా భ్రాంతికి లోను కావటంగా చెప్పారు.ఈ వ్యాధి లక్షణాలు గులాబీ నేతల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు.
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వకుండానే ఇచ్చామని అంటున్నారని.. మూడు ఎకరాలు పంచకుండానే పంచినట్లుగా చెప్పేసుకుంటున్నారని.. కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా భ్రమ పడుతున్నారని.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని అమలు చేయలేదన్నారు.
ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని నిరూపించటానికి తాము సిద్ధమని.. అందుకు గాంధీ భవన్ అయినా.. పైరవీ భవన్ అయినా తనకు అభ్యంతరం లేదంటూ మండిపడ్డారు. గులాబీ నేతలకున్న స్కిజోఫ్రీనియా వ్యాధికి అదనంగా మంత్రి జగదీశ్ రెడడ్ఇకి అయితే అల్జీమర్స్ ఉన్నట్లుగా చెప్పారు. ఇటీవల ఆయన మంత్రిత్వ శాఖపై కాగ్ తీవ్ర వ్యాఖ్యలు చేసినా.. వాటిని మర్చిపోయినట్లుగా మాట్లాడటాన్ని ప్రస్తావించారు. వ్యాధి మాటేమో కానీ.. గులాబీ నేతల్ని వెరైటీగా వేసుకోవటంలో దాసోజ్ సక్సెస్ అవుతున్నారని చెప్పక తప్పదు.