Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫోన్ కాల్స్: టీఆర్ఎస్ లోకి స్వామిగౌడ్.. బీజేపీకి షాక్

By:  Tupaki Desk   |   21 Oct 2022 10:30 AM GMT
కేసీఆర్ ఫోన్ కాల్స్: టీఆర్ఎస్ లోకి స్వామిగౌడ్.. బీజేపీకి షాక్
X
ఎక్కడ పోయిందో అక్కడే వెతకాలని కేసీఆర్ నిర్ణయించుకున్నాడు. తన వైఖరితో టీఆర్ఎస్ నుంచి ఉద్యమకారులు బీజేపీకి వెళ్లారు.. ఇప్పుడు వారినే తన చెంతకు చేర్చుకున్నాడు. ఒక మెట్టు వెనక్కి జరిగి.. తప్పును తెలుసుకొని వలసపోయిన ఉద్యమకారులకు స్వయంగా కేసీఆర్ ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. కేసీఆర్ అంతటి వ్యక్తి ఫోన్లు చేయడంతో పోయిన నేతలంతా తిరిగి వస్తున్నారు.

బీజేపీలో చేరిన సీనియర్ తెలంగాణ నేత దాసోజు శ్రవణ్ మళ్లీ వెనక్కి వచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ బీజేపీకి షాకిస్తూ తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. టీఆర్ఎస్ లోనే ఉద్యమకారుడిగా రాజకీయం మొదలుపెట్టిన శ్రవణ్ తిరిగి.. కాంగ్రెస్, బీజేపీలో చేరి అనంతరం మళ్లీ టీఆర్ఎస్ లోకే తిరిగి రావడం విశేషం. మునుగోడు ఉప ఎన్నికల వేళ బీజేపీ తరుఫున బలంగా వాయిస్ వినిపిస్తున్న శ్రవణ్.. ఆ పార్టీకి షాకిస్తూ టీఆర్ఎస్ లో చేరడం విశేషం.

ఇవాళ సాయంత్రం మంత్రి కేటీఆర్ సమక్షంలో దాసోజు శ్రవణ్ గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మధ్యనే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు శ్రవణ్. కనీసం రెండు నెలలు కాకముందే ఆయన మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక శ్రవణ్ చేరిక ఖాయమైన వెంటనే కేసీఆర్ టీఆర్ఎస్ నుంచి వెళ్లిన మరో ఉద్యమ నేత , శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కు ఫోన్ చేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు.. కేసీఆర్ తనకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా వేధించాడని.. ఏ పోస్టు ఇవ్వలేదని మనస్థాపం చెందిన టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో కొన్ని నెలల క్రితం స్వామిగౌడ్ చేరారు.

ఈ క్రమంలోనే దాసోజు శ్రవణ్ సహా స్వామిగౌడ్ లాంటి నేతలకు కేసీఆర్ ఫోన్లు చేసి మరీ పిలిపించారు. కేసీఆర్ పిలుపు మేరకు ప్రగతి భవన్ వచ్చిన స్వామిగౌడ్ కలిశారు. ఈ సందర్భంగా స్పష్టమైన హామీ లభించడంతో కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో తిరిగి స్వామి గౌడ్ చేరారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.