Begin typing your search above and press return to search.
‘‘గ్రేటర్’’లో గ్రేట్ ట్యాంపరింగ్ అంటున్నారు
By: Tupaki Desk | 8 Feb 2016 3:59 AM GMTగ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెల్లడై.. చారిత్రక విజయాన్ని టీఆర్ ఎస్ నమోదు చేసుకున్న వేళ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సరికొత్త ఆరోపణల్ని షురూ చేసింది. గ్రేటర్ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖ్యమంత్రి కేసీఆర్ తో కుమ్మక్కు కావటంతో పాటు..ఎన్నికల అవకతవలకు పాల్పడినట్లుగా టీ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తన వాదనకు తగినట్లే కొన్ని అంశాల్ని ప్రస్తావిస్తూ.. తాము చెప్పే వాదనలో నిజం ఉందన్న భావనను కలుగజేసేందుకు ప్రయత్నిస్తోంది.
గ్రేటర్ ఎన్నికల్లో ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మంట పుట్టిస్తున్నాయి. గ్రేటర్ పోలింగ్ కోసం వినియోగించిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానాలు రోజురోజుకీ బలపడుతున్నాయంటూ ఆయన చెబుతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లటంతో పాటు.. కోర్టుల్లో ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.
దాసోజు శ్రవణ్ సందేహాలు చూస్తే..
= ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని ఎన్నికల నిఘా సంస్థ నేత ఏవీ రావ్ రుజువు చేస్తూ సుప్రీంలో పిటీషన్ వేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఓటింగ్ యంత్రాలకు ప్రింటింగ్ మిషన్ లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసినా.. గ్రేటర్ ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటింగ్ మిషన్ లను ఎందుకు ఏర్పాటు చేయలేదు?
= బిహార్.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటింగ్ మిషన్ లను అమర్చారు. గ్రేటర్ ఎన్నికల్లో అలా ఎందుకు చేయలేదు?
= గ్రేటర్ ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటింగ్ మిషన్లు.. ఈవీఎంలకు నోటా బటన్ ఎందుకు పెట్టలేదు?
= జాంబాగ్ లో తమ పార్టీ అభ్యర్థి విక్రమ్ గౌడ్ కుటుంబ సభ్యుల ఓట్లు ఒక పోలింగ్ బూత్ పరిధిలో 125 ఉంటే కేవలం 20 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అదెలా సాధ్యం?
= 142వ డివిజన్ అడ్డగుట్టలో ఒక పోలింగ్ కేంద్రంలో 556 ఓట్లు పోలైతే.. లెక్కింపులో 992 ఓట్లు ఎలా వచ్చాయి? ట్యాంపరింగ్ కు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?