Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ - బీజేపీ..తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమేదీ?
By: Tupaki Desk | 25 Aug 2019 2:30 PM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక సీటును సాధించిన బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఏకంగా నాలుగు పార్లమెంట్ సీట్లను సాధించి ఔరా అనిపించింది. ఇప్పుడు అధికార టీఆర్ ఎస్ తోనే ఢీ అంటోంది. తెలంగాణలో టీఆర్ ఎస్ కు బలమైన ప్రతిపక్షం తామే అంటూ కాంగ్రెస్ నాయకులను లాగే ప్రయత్నం చేస్తోంది. మరి నిజంగా బీజేపీ చెబుతున్నట్టు తెలంగాణలో అంత బలముందా.? కాంగ్రెస్ ను తోసిరాజని ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతుందా అంటే కష్టమేనంటున్నారు కాంగ్రెస్ వర్గాలు.
తాజాగా టీకాంగ్రెస్ సీనియర్ నేతలు దాసోజు శ్రవణ్ - ఇతర నేతలు లెక్కలతో సహా తెలంగాణలో బీజేపీకి అంత సీన్ లేదని చెబుతున్నారు. తెలంగాణలో టీఆర్ ఎస్ కు దాదాపు 47.38శాతం ఓటు బ్యాంకు ఉందని.. కాంగ్రెస్ కు 29.79శాతం ఓటు బ్యాంకు ఉందని.. అదే బీజేపీకి కేవలం 20శాతం లోపు మాత్రమే ఓటు బ్యాంకు వచ్చిందని చెబుతున్నాయి. పోయిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని వారు లెక్కగట్టి వివరిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు 88 సీట్లు 47.38శాతం ఓటు బ్యాంకు వచ్చింది. అదే కాంగ్రెస్ కు 29.79శాతంతో 19 సీట్లు వచ్చాయి. ఇక బీజేపీకి కేవలం 7.15శాతం ఓటు బ్యాంకుతో ఒక్కసీటు వచ్చింది.
పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ పుంజుకొని 19.65శాతం ఓట్లతో నాలుగు ఎంపీ సీట్లను సాధించింది. దీన్ని బట్టి బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఓట్లు పడ్డాయని.. అసలు గ్రామీణ ప్రాంతంలో బీజేపీకి శాఖలు - కార్యకర్తలు - బలం లేదని కాంగ్రెస్ విశ్వసిస్తోంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కు గ్రామ స్థాయి నుంచి కార్యకర్తల బలం ఉందంటున్నారు.తెలంగాణలో బీజేపీ బలపడే చాన్స్ లేదని వారు చెబుతున్నారు.