Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పై ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌లు త‌ప్ప‌న్న కాంగ్రెస్‌

By:  Tupaki Desk   |   27 March 2019 11:20 AM GMT
జ‌గ‌న్ పై ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌లు త‌ప్ప‌న్న కాంగ్రెస్‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అనుకూలంగా ఎన్నిక‌ల ప్ర‌చారాన్నినిర్వ‌హించేందుకు ఏపీకి వ‌చ్చిన జ‌మ్ముక‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఫ‌రూక్ అబ్దుల్లా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే. క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌లో ఆయ‌న పాల్గొన్న ఎన్నిక‌ల స‌భ‌లో మాట్లాడుతూ.. వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత.. త‌న‌ను సీఎం చేయ‌టానికి రూ.1500 కోట్లు ఖ‌ర్చు చేసేందుకు తాను సిద్ధ‌మ‌ని జ‌గ‌న్ త‌న‌తో చెప్పిన‌ట్లుగా ఫ‌రూక్ వ్యాఖ్యానించారు.

త‌న ఇంటికి వ‌చ్చిన జ‌గ‌న్‌.. ఆ రోజు త‌న‌తో అన్న మాట‌లు త‌న‌కు ఇప్ప‌టికి గుర్తున్నాయ‌ని చెప్పాలి. డ‌బ్బు పేరాశ ఉన్న జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కాకూడ‌ద‌న్న మాట‌ను ఆయ‌న చెప్పారు. అప్పుడెప్పుడో జ‌రిగిందంటూ ఈ రోజు ఫ‌రూక్ చెప్పిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది. నిజంగా జ‌గ‌న్ అలాంటి ఆఫ‌ర్ చేసి ఉంటే.. ఫ‌రూక్ లాంటి ముక్కుసూటి మ‌నిషి ఆ విష‌యం గురించి ఇప్ప‌టివ‌ర‌కూ రివీల్ ఎందుకు చేయ‌లేద‌న్న‌ది ప్ర‌శ్న‌. దీనిపై ఫ‌రూక్ సైతం ఇప్ప‌టివ‌ర‌కూ స‌మాధానం చెప్ప‌టం లేదు.

ఇదిలా ఉంటే.. ఫ‌రూక్ అబ్దుల్లా చేసిన తీవ్ర ఆరోప‌ణ‌పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. జ‌గ‌న్ పై ఫ‌రూక్ లాంటి నేత దారుణ ఆరోప‌ణ‌లు చేయ‌టాన్ని త‌ప్పు ప‌ట్టింది. తాజాగా ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దాసోజు శ్ర‌వ‌ణ్ మాట్లాడుతూ.. ఫ‌రూక్ చేసిన ఆరోప‌ణల్లో అబ‌ద్ధ‌మ‌న్నారు.

త‌న‌ తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత సీఎం అయ్యేందుకు జ‌గ‌న్ అనేక ప్ర‌య‌త్నాలు చేసిన వైనాన్ని ప్ర‌స్తావించారు. ఇదంతా నిజ‌మ‌న్నారు. కాంగ్రెస్ కు రూ.1500 కోట్ల‌ను ఆఫ‌ర్ చేయ‌టంలో మాత్రం నిజం లేద‌న్నారు. వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత ఎవ‌రికి సీఎం కుర్చీని ప‌ద‌విని క‌ట్ట‌బెట్టాల‌న్న టెన్ష‌న్ నేప‌థ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్టీలో సీనియ‌ర్ నేత అయిన రోశ‌య్య‌ను సీఎంగా ఎంపిక చేసిన వైనాన్ని గుర్తు చేశారు. ఫ‌రూక్ ఆరోప‌ణ‌ల‌పై జ‌గ‌న్ పార్టీ కంటే తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండించ‌టం గ‌మ‌నార్హం.