Begin typing your search above and press return to search.
దాసోజు సుడి తిరిగినట్లేనా?
By: Tupaki Desk | 21 Oct 2018 4:53 AM GMTమాటల ప్రభావం ఎంతన్నది తెలంగాణ ప్రజలకు తెలియంది కాదు. మాట.. పాట అనే రెండు ఆయుధాలతో ఏకంగా ఒక కొత్త రాష్ట్రాన్నే సాధించుకున్న ఘనత తెలంగాణ ప్రజలది. మరి.. అంత ప్రభావం చూపించే ఈ రెండింటిని సమపాళ్లలో సరిగా అందించాలే కానీ.. దాని ప్రభావం మామూలుగా ఉండదు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం గ్రహించినట్లుంది. మంత్రించినట్లు మాట్లాడే తెలంగాణ అపద్దర్మ ముఖ్యమంత్రి మాటలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ప్రజల మనసుల్ని దోచుకోవటానికి వీలుగా రాహుల్ తన ప్రసంగాన్ని మార్చుకున్నారు.
అక్కడితో సరిపోదుగా. ఎందుకంటే.. రాహుల్ హిందీలో మాత్రమే మాట్లాడతారు. తెలంగాణలో చాలా చోట్ల హిందీ అర్థమయ్యే పరిస్థితి ఉన్నా.. తెలుగులో ఉండే ఎఫెక్ట్ వేరే. ఆ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణలో రాహుల్ పర్యటనల సందర్భంగా ఆయన మాటల్ని తెలుగులోకి అనువదించేందుకు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కు అప్పజెప్పారు.
సహజంగానే మంచి మాటకారి అయిన దాసోజు.. తాజాగా తనకు లభించిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో వాడేసుకున్నారని చెప్పాలి. తాజాగా జరిగిన రాహుల్ తెలంగాణ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన మూడు సభల్లోనూ రాహుల్ ప్రసంగాల్ని అనువదించే బాధ్యతను సమర్థంగా పోషించారు దాసోజు. రాహుల్ మాటల ఎఫెక్ట్ ను ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్న దాసోజు.. తన అనువాదంతో అందరి మనసుల్ని దోచేశారు.
రాహుల్ ఉద్వేగ ప్రసంగాల్ని.. అంతే టెంపోలో రాసోజు అనువదించటం ఒక ఎత్తు అయితే.. అనువాదంలో భాగంగా జరిగే పొరపాట్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని తీరు పలువురిని ఆకట్టుకుంది. రాహుల్ హిందీ లెక్కలకు ఏ మాత్రం తేడా లేకుండా అప్పటికప్పుడు ఎలాంటి తడబాటు లేకుండా.. ఆ లెక్కల్ని తెలుగులోకి అనువదించిన దాసోజు శ్రవణ్ సమర్థతను రాహుల్ గుర్తించినట్లుగా చెప్పక తప్పదు.
శ్రవణ్ పడిన కష్టాన్ని.. తన హిందీ ప్రసంగాన్ని తెలుగులో అంతే ఎఫెక్టివ్ గా అనువదించిన తీరును రాహుల్ గుర్తించటమే కాదు.. ఆయన అనువాదానికి రాహుల్ నుంచి కాంప్లిమెంట్లు లభించాయి. చూస్తుంటే..దాసోజు కష్టం ఫలించటమే కాదు.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి కంట్లో పడ్డారన్న మాట వినిపిస్తోంది. కాలం కలిసి వస్తే.. దాసోజు సుడి తిరిగిపోతుందన్న మాట బలంగా వినిపిస్తోంది.