Begin typing your search above and press return to search.

ఏపీ అసెంబ్లీ.. జూలై పదకొండు నుంచి!

By:  Tupaki Desk   |   26 Jun 2019 5:05 AM GMT
ఏపీ అసెంబ్లీ.. జూలై పదకొండు నుంచి!
X
నూతన ప్రభుత్వం ఏర్పడ్డాకా రెండో సారి అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధం అవుతూ ఉంది ఏపీలో. ఇటీవలే వైఎస్ జగన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో తొలి సారి సభా సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. వాడీవేడీగా సాగాయి ఆ సమావేశాలు. ఇంతలోనే మరోసారి సభా సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. జూలై పదకొండు నుంచి సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది.

ముహూర్తాన్ని చూసుకునే సమావేశాలను నిర్వహించబోతూ ఉంది జగన్ ప్రభుత్వం. కీలకమైన బడ్జెట్ సమావేశాలను దశమి రోజు నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూలై పదకొండు నుంచి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయని సమాచారం.

మొత్తం 15 పనిదినాల్లో సభ సాగుతుందని తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం ఆ సమావేశాల్లో తన తొలి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ రూపకల్పనలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

నూతనంగా అమలు చేయనున్న సంక్షేమ పథకాల మీద కసరత్తు సాగుతూ ఉందని తెలుస్తోంది. రైతులకు పెట్టుబడి నిధి - అమ్మ ఒడితో సహా వివిధ సంక్షేమ పథకాలను అమలు చేయడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతోంది జగన్ ప్రభుత్వం. ఆ విషయంలో నిధుల కేటాయింపు - సమీకరణ ఎలా ఉండబోతోందో.. బడ్జెట్ తో స్పష్టత రాబోతోంది.