Begin typing your search above and press return to search.
డేటింగ్ యాప్ లో పరిచయమైంది.. బ్యాంక్ మేనేజర్ దగ్గర రూ.6 కోట్లు కొట్టేసింది!
By: Tupaki Desk | 25 Jun 2022 8:30 AM GMTచక్కటి భార్య.. ఇద్దరు పిల్లలు.. మంచి ఉద్యోగం.. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు లేని లైఫ్. ఇదంతా చదివిన తర్వాత ఇంతకు మించి ఇంకేం కావాలని ఎవరైనా అనుకుంటారు. కానీ.. ఇక్కడే.. ఇంతకు మించి కావాలన్న ఆశ పుడుతుంది. అలాంటిదే జరిగితే.. ఏం జరుగుతుందో తాజా ఉదంతం చెబుతుంది. చక్కగా సాగే జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకోవటం ఏమిటో చెప్పే ఈ వైనం కర్ణాటకలోని బెంగళూరు మహానగరంలో చోటు చేసుకుంది.
ఎందుకు వెళ్లారో తెలీదు కానీ డేటింగ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని తన స్మార్ట్ ఫోన్లులో వాడటం మొదలుపెట్టాడు హరిశంకర్ అనే బ్యాంక్ మేనేజర్. సాఫీగా సాగుతున్న జీవితాన్ని కల్లోలంలోకి నెట్టేసుకున్నాడు. యాప్ లో పరిచయమైన మహిళతో స్నేహం.. ఆ తర్వాత సాన్నిహిత్యాన్ని పెంచుకొని.. వీడియోకాల్స్ చేసుకునే వరకు విషయం వెళ్లింది.
ఇలాంటి స్నేహాల్లో ఎక్కువగా ఏం జరుగుతుందో.. ఇక్కడా అదే జరిగింది. మాంచి టైం చూసుకొని ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దామంటూ ప్రపోజల్ రావటం.. మరో ఆలోచన లేని బ్యాంక్ మేనేజర్ హరీశ్ శంకర్ తన వద్దనున్న రూ.12 లక్షల డిపాజిట్లను నగదుగా మార్చి బదిలీ చేశాడు.
వ్యాపారానికి ఈ మొత్తం సరిపోదని.. మరింత కావాలని చెప్పటంతో తన గీతను దాటేసి మరీ.. అనిత అనే సీనియర్ సిటిజన్ ఖాతాలో ఉన్న రూ.6 కోట్ల మొత్తాన్ని రుణాన్ని ఇస్తున్నట్లుగా పేర్కొంటూ ఆన్ లైన్ ప్రియురాలి ఖాతాకు దఫ.. దఫాలుగా బదిలీ చేశాడు. ఇలా రూ.5.69 కోట్ల భారీ మొత్తాన్ని బదిలీ చేసిన వేళలో.. డిపాజిట్లు ఉన్న సీనియర్ సిటిజన్ అనిత మొబైల్ కు దీనికి సంబంధించిన మెసేజ్ రావటంతో ఆమె బ్యాంకు వచ్చి.. విచారించారు.
విషయాన్ని అర్థం చేసుకొని కంప్లైంట్ ఇవ్వటంతో.. మేనేజర్ ను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఎప్పటిలానే డేటింగ్ యాప్ లో పరిచయమైన మహిళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో బ్యాంకుకు చెందిన మరో చిరు ఉద్యోగి కూడా సాయం చేసినట్లుగా చెబుతున్నారు. ఏమైనా..
ఆన్ లైన్ లో మొదలయ్యే స్నేహాలు ఏదోలా కొంపముంచటం ఖాయమని మాత్రం చెప్పక తప్పదు. సో.. బీకేర్ ఫుల్.