Begin typing your search above and press return to search.
ఆ డేటింగ్ రాకెట్ ను ఇలా ఆపరేట్ చేస్తారట!
By: Tupaki Desk | 14 July 2018 10:16 AM GMTతమిళ నటి జయలక్ష్మి తమిళనాడులోని `డేటింగ్ రాకెట్ `గుట్టు రట్టు చేసిన సంగతి తెలిసిందే. ఫలానా వీఐపీలు మీతో డేటింగ్ కు రెడీగా ఉన్నారని....లక్షల్లో డబ్బు ముట్టజెబుతామని జయలక్ష్మికి ఆఫర్లు పంపడం కలకలం రేపింది. తనకు ఈ తరహా మెసేజ్ లు పంపి - ఫోన్ లు చేసిన ఇద్దరు వ్యక్తులపై జయలక్ష్మి ....పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ రాకెట్ బట్టబయలైంది. తమిళనాడులోని విరుగంబాక్కానికి చెందిన మురుగ పెరుమాన్ - కవియరసన్ లపై విచారణ జరిపిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ డేటింగ్ వ్యవహారమంతా ఆ ముఠా సభ్యులు...సోషల్ మీడియాలోనే నడిపిస్తున్నారని తెలుసుకొని పోలీసులు షాకయ్యారు. వాట్సాప్ - మెసెంజర్...లలో మెసేజ్ లు - వాయిస్ కాల్స్ - ఫొటోలు - వీడియో కాల్స్ ...లతోనే డీల్ సెట్ చేసుకొంటోన్న వైనం పోలీసులను విస్మయపరిచింది. అంతేకాకుండా, ఆ రాకెట్ నిర్వాహకుల జాబితాలో కోలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరోయిన్ తో పాటు పలువురు నటీమణులు ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. ఒక రాత్రికి ఒక హీరోయిన్ తో గడిపేందుకు దాదాపు 40లక్షలు చెల్లించేందుకు కూడా కొందరు బడాబాబులు సిద్ధంగా ఉన్నట్లు ఆ విచారణలో తేలడంతో పోలీసులు షాకయ్యారు. అయితే, ఈ వ్యవహారమంతా దాదాపు వాట్సాప్ లో ...చాలా క్రమ పద్దతి ప్రకారం నిర్వహించడం మరింత ఆశ్చర్యం కలిగించకమానదు.
ఈ వ్యవహారాలు నడిపేందుకు మురుగ పెరుమాన్ - కవియరసన్ లు....వాట్సాప్ నే వేదికగా చేసుకున్నారు. గత ఐదేళ్లుగా ఎవరికీ అనుమానం రాకుండా ఎంతో ఆర్గనైజ్డ్ గా ఈ హైటెక్ డేటింగ్ రాకెట్ సాగిస్తున్నారు. నటీమణులు - హీరోయిన్ల ఫొటోలు...వివరాలను విటులకు, వీఐపీలకు పంపేవారు. తమకు అందుబాటులో ఉన్న హీరోయిన్లు ఫొటోలు - ఒక నైట్ కు వారు ఎంత తీసుకుంటారు.....ఇత్యాది వివరాలతో పెళ్లి ఆల్బమ్ తరహాలో..... ఏకంగా ఓ డిజిటల్ ఆల్బమ్ నే వారు తయారుచేశారు. అంతే కాకుండా 70 మంది హీరోయిన్ల ఫొటోలు-రేట్ల మాన్యువల్ ఆల్బమ్ ను కూడా వీరు మెయింటెన్ చేసేవారు. పెళ్లిళ్ల బ్రోకర్ల మాదిరిగా....బడా వ్యాపారవేత్తలకు - సినీ ప్రముఖులకు - రాజకీయ నాయకులకు ఈ ఫొటోలను వాట్సాప్ లో పంపేవారు. అయితే, ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లు...టీవీ నటులను వీరు ఎక్కువగా టార్గెట్ చేసేవారట. కామన్ ఫ్రెండ్స్ - పీఆర్ ల ద్వారా ఆ నటీమణులతో టచ్ లో ఉంటారట. వలసరవక్కంలో ఓ ప్రొడక్షన్ ఆఫీస్ ను ఓపెన్ చేసి...తెర వెనుక ఈ డేటింగ్ రాకెట్ ను నడుపుతున్నారట. దీని కోసం ఏకంగా వీరు ఓ ఫేస్ బుక్ పేజీని కూడా నిర్వహిస్తున్నారట. ఇంకో అడుగు ముందుకు వేసి...కొన్ని అడల్ట్ వెబ్ సైట్లలో....ఫలానా హీరోయిన్ రేటు ఇంత....అని ప్రకటనలు కూడా గుప్పించేవారట. గతంలో కూడా చాలామంది వీవీఐపీలకు హీరోయిన్లు - నటీమణులను సరఫరా చేసినట్లు వారు పోలీసులకు తెలిపారు. ఆ ఇద్దరి ఫోన్లలో....కొందరు హీరోయిన్లతో బేరసారాలకు సంబంధించిన మెసేజ్ లను పోలీసులు చదివారని తెలుస్తోంది. ఈ డేటింగ్ కోసం ....కొందరు హీరోయిన్లు...వీడియో కాల్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇలా మొత్తం 70 మంది నటీమణులు - యువతులు - హీరోయిన్ల అసభ్య ఫొటోలు - వారి రేట్లతో సహా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. కొందరి వాట్సాప్ చాటింగ్ లను సేకరించిన పోలీసులు.. ఫోటోలు - రేట్లు ఉన్న ఆల్బమ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై వెనుక ఎవరున్నారు? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.