Begin typing your search above and press return to search.
చేస్తానని చెప్పి. గవర్నర్‌కి వదిలేస్తున్న దత్తన్న
By: Tupaki Desk | 8 Jun 2015 9:11 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ మధ్య విజయవాడకు ఒక కార్యక్రమంలో పాల్గనేందుకు వెళ్లిన ఆయన.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పరిణామాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇద్దరు ముఖ్యమంత్రుల్ని సెట్ చేస్తానని.. రెండు రాష్ట్రాల మధ్య చక్కటి సంబంధాల కోసం ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు.
మధ్యవర్తిగా ఉండమని ఎవరూ చెప్పకుండానే.. తనకు తానుగా దత్తన్న పెద్దమనిషిగా ఉంటానని చెప్పటంపై పలువురు సంతోషపడిపోయారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న ఓటుకు నోటు వ్యవహారంపై దత్తన్న స్పందిస్తూ.. జరుగుతున్న పరిణామాలు ఎవరికి మంచిదికాదని చెప్పుకొచ్చారు. బాబు ఆడియో టేపుల గురించి తానిప్పుడే మాట్లాడలేనని చెప్పిన దత్తన్న.. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చూస్తారని చెప్పటం విశేషం.
ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల్ని ఒకచోట కూర్చొని సెట్ చేస్తానని చెప్పిన దత్తన్న.. ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడటం చూస్తుంటే.. ఇద్దరు చంద్రుళ్ల మధ్య రాజీ వ్యవహారం అంత తేలిక కాదన్న విషయం అర్థమై ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఒకవేళ.. ఇద్దరిని సెట్ చేసే అవకాశమే ఉంటే.. వెంకయ్య ఆ పని ఎప్పుడో పూర్తి చేసేవారు కదా..?