Begin typing your search above and press return to search.

ఆర్ ఎస్ ఎస్: దాడులు చేస్తుంటే ఇలా చేయాలి

By:  Tupaki Desk   |   5 Jan 2016 6:30 AM GMT
ఆర్ ఎస్ ఎస్: దాడులు చేస్తుంటే ఇలా చేయాలి
X
ప‌టాన్‌ కోట్‌ పై పాకిస్తాన్‌ దాడి.. తాజాగా జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌ భార‌తీయుల్లో రెండు అభిప్రాయాల‌ను క‌లిగించింది. ఒక‌టి భార‌త‌దేశంను రెచ్చ‌గొట్టడంలో పాకిస్తాన్ వైఖ‌రి ఏ మాత్రం మార‌లేద‌ని చెప్పింది. రెండోది ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ పాకిస్తాన్ ప‌ర్య‌ట‌న త‌ర్వాత ఈ దాడి జ‌ర‌గ‌డం మోడీ అతి మంచిత‌నాన్ని ఎద్దేవా చేసిన‌ట్లు అయింది. అయితే ఈ దాడిపై దేశంలో పెద్ద ఎత్తున‌ అసంతృప్తులు చెల‌రేగ‌డంతో పాటు పాకిస్తాన్‌ ను దెబ్బ‌కొట్టాల‌నే డిమాండ్ వినిపిస్తోంది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాతృక సంఘ్ మాత్రం భిన్న స్వ‌రం వినిపించింది.

పాకిస్తాన్‌ దాడులు చేస్తున్నా సరే పాకిస్తాన్‌ కు స్నేహ హస్తమందించి కలిసి జీవించాలనే భారత్‌ సంస్కృతి సందేశాన్ని వినిపించాల్సిన బాధ్యత మనపై ఉందని ఆరెస్సెస్‌ సంయుక్త కార్యదర్శి దత్రాత్తేయ హొసబలే అన్నారు. లాహోర్‌ లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీ ఆకస్మిక పర్యటనను ఈ సందర్భంగా అభినందించారు. ప‌ర్య‌ట‌న త‌ర్వాత కొద్దిరోజులకే పంజాబ్‌ లోని పఠాన్‌ కోట్‌ లో ఉగ్రవాదులు దాడి జరపడంపై ఆయ‌న విచారం వ్యక్తం చేశారు. 'కౌరవులు - పాండవులు శత్రువులైనా తొలుత వారు అన్నదమ్ములు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ధర్మ పరిరక్షణ కోసం అన్ని మార్గాలనూ అనుసరించాలి. వాజ్‌ పేయి కూడా ఈ మార్గాన్నే ఎంచుకున్నారు. లాహోర్‌ కు బస్సు యాత్ర ప్రారంభించిన ఆయనే కార్గిల్‌ యుద్ధాన్ని కూడా ప్రకటించార'ని వివరించారు. సంఘ్ విధానం కూడా మిత్రుత్వ‌మేన‌ని హోస‌బ‌లే చెప్పారు. గత ఏడాది సెప్టెంబరులో బీజేపీ అగ్రనాయకులతో సమావేశమైనప్పుడు ఒకప్పుడు భారత్‌ లో భాగమైన దాయ‌ది దేశంతో సంబంధాల పునరుద్ధరణకోసం చేసిన సూచనను గుర్తు చేశారు.