Begin typing your search above and press return to search.

తండ్రి రాసలీలలు.. ఆన్ లైన్ క్లాసులతో బయటపడింది

By:  Tupaki Desk   |   7 Dec 2020 2:30 PM GMT
తండ్రి రాసలీలలు.. ఆన్ లైన్ క్లాసులతో బయటపడింది
X
ఆన్ లైన్ క్లాసుల మూలంగా స్మార్ట్ ఫోన్ లో ఓ తండ్రి రాసలీలల దృశ్యాలు ఓ కుమార్తె కంటపడ్డాయి. ఆ వీడియోలను తల్లికి చూపించడంతో ఆ తండ్రి బండారం బయటపడింది. ఈ ఘటన కర్ణాటకలోని మాండ్య జిల్లా నాగమంగల తాలూకాలో చోటుచేసుకుంది.

కుమార్ అనే వ్యక్తి తాజాగా ఆన్ లైన్ క్లాసుల కోసం కుమార్తెకు అతడి స్మార్ట్ ఫోన్ ను ఇచ్చాడు. కాసేపు క్లాసుల్లో నిమగ్నం అయిన కుమార్తె.. క్లాసులు అయిపోయాక తండ్రి స్మార్ట్ ఫోన్ లో కొన్ని ఫోల్డర్స్ చూసింది.

అందులో తండ్రి వీడియోలు చూసి షాక్ తిన్నది. ఆ వీడియోల్లో తండ్రి మరో మహిళతో చనువుగా ఉన్న దృశ్యాలు కనిపించడంతో అవాక్కైంది. వెంటనే సదురు వీడియోలను తల్లికి చూపించింది.

షాక్ కు గురైన తల్లి.. భర్త చేసిన నిర్వాకం చూసి న్యాయం చేయాలంటూ మహిళా స్వాంతన కేంద్రాన్ని ఆశ్రయించింది. నాగమంగల పోలీస్ స్టేషన్ లో భర్తపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.