Begin typing your search above and press return to search.

భారత్ అంటే హెడ్లీకి అంత కోపమెందుకు?

By:  Tupaki Desk   |   26 March 2016 9:08 AM GMT
భారత్ అంటే హెడ్లీకి అంత కోపమెందుకు?
X
ముంబయి పేలుళ్ల కేసులో అప్రూవర్ గా మారిన డేవిడ్ హెడ్లీ ఇండియాను తీవ్రంగా ద్వేషిస్తానడన్న సంగతి తెలిసిందే. అయితే.. ఇండియాపై ఆ టెర్రరిస్టు కు ఎందుకంత కసో తెలుసా..? చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన ఆయనలో తీవ్ర కసి పెంచిందట. భారత వాయు సేనకు చెందిన విమానం 1971లో మా స్కూలు మీద బాంబులేసింది. ఆ ప్రమాదంలో పలువురు మరణించారు. అప్పటి నుంచి నాకు ఇండియా అంటే విపరీతమైన ద్వేషం - భారతీయులను నాశనం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నానని హెడ్లీ శుక్రవారం ముంబై ప్రత్యేక న్యాయస్థానంలో జరుగుతున్న క్రాస్‌ ఎగ్జామినేషన్‌ లో చెప్పారు. ముంబై పేలుళ్ల జరిగిన 26/11 తర్వాత కొద్ది రోజులకే అప్పటి పాక్‌ ప్రధాని యూసఫ్‌ రాజా గిలానీ పాకిస్థాన్‌ లోని మాఇంటికి వచ్చారని అప్రూవర్‌ గా మారిన డేవిడ్‌ హెడ్లీ ప్రత్యేక కోర్టుకు వెల్లడించారు.

మాజీ ప్రధాని గిలానీ నాతండ్రి చనిపోయినపుడు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాలేదు. ముంబై దాడులు జరిగిన కొద్ది వారాలకు వచ్చారని ప్రత్యేక న్యాయమూర్తి జీఏ సనాప్‌ ఎదుట వెల్లడించారు. ఆయనను అబ్దుల్‌ వహాబ్‌ ఖాన్‌ క్రాస్‌ ఎగ్జామిన్‌ చేశారు. పాకిస్థాన్‌ రేడియో డైరెక్టర్‌ జనరల్‌ గా పని చేసిన తన తండ్రికి కూడా లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థతో తనకున్న సంబంధాల గురించి తెలుసని చెప్పారు. అయితే ఆయన దీనిని వ్యతిరేకించారని, లష్కరేలో చేరవద్దని కోరారని, తనపై తీవ్ర అసంతృపిత్తో ఉండేవారని చెప్పారు. మారుటి సోదరుడు డేనియల్‌ కు కూడా లష్కరేతో నాకున్న సంబంధాలు గురించి తెలిసినా, ఆయన తమతో పాటు పాకిస్థాన్‌ లో కలిసి ఉండలేదని అన్నారు. పాకిస్థాన్‌ లో నా స్నేహితుడు సౌలాత్‌ రానాకు లష్కరేతో నాకున్న సంబంధాల గురించి తెలుసు. అంతేకాకుండా 26/11 దాడుల కోసం ముంబైకు వెళుతున్నాననే విషయం కూడా తెలుసు. ఆయన నా పనులను వ్యతిరేకించలేదు, ప్రోత్సహించలేదని చెప్పారు.

హెడ్లీ మరికొన్ని సంచలన విషయాలనూ చెప్పారు. ఇష్రత్‌ జహాన్‌ పేరు చెప్పమని ఎన్‌ ఐఏ సలహా ఇవ్వలేదని స్పష్టం చేశారు. అమెరికాలో శివసేన కోసం విరాళాల సేకరణను ప్రారంభించి ఆ కార్యక్రమానికి బాలథాకరేను ఆహ్వానించాలని భావించాను ఆయన అనారోగ్యంగా ఉన్నారని అందువల్ల ఆయన కుమారుడు లేదా ఇతర అధికారులు కార్యక్రమానికి హాజరయ్యే అవకాశముందని శివసేన నేత చెప్పడంతో విరమించుకున్నట్లు చెప్పారు. అలాగే పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ ను హత్య చేయాలనుకోలేదని డేవిడ్‌ హెడ్లీ చెప్పాడు. తన అనుచరుడితో కలిసి తాను ముషార్రఫ్‌ ను హత్య చేయడానికి యత్నించాడనంలో ఎంతమాత్రం వాస్తవం లేదని హెడ్లీ స్పష్టం చేశారు.