Begin typing your search above and press return to search.
చీటింగ్ కామెంట్స్ కు వార్నర్ రియాక్షన్ ఇదే
By: Tupaki Desk | 7 Sep 2019 9:11 AM GMTఎప్పుడో సంవత్సరంన్నర కిందట జరిగిన ‘బాల్ ట్యాంపరింగ్’ తప్పు అదీ. ఆ తప్పును తెలుసుకొని ఏడాది నిషేధంతో శిక్ష అనుభవించి ఆస్ట్రేలియా క్రికెటర్లు వార్నర్, స్మిత్ లు మళ్లీ క్రికెట్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం యాషెస్ సిరీస్ లో స్టీవ్ స్మిత్ సెంచరీల మోత మోగిస్తూ అదరగొడుతున్నారు. ఇక వార్నర్ కూడా ఫర్వాలేదనిపిస్తున్నాడు..
ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ ల మధ్య జరుగుతున్న యాషెస్ టెస్ట్లో స్మిత్, వార్నర్ లను ఇంగ్లీష్ అభిమానులు వదలడం లేదు. వీరి బాల్ ట్యాంపరింగ్ వివాదాన్ని తెరపైకి తెచ్చి ‘చీటర్స్’ అంటూ కనపడ్డప్పుడల్లా తిట్టిపోస్తున్నారు. చీటర్స్, చీటర్స్ అంటూ స్టేడియంలో మోత మోగిస్తున్నారు.
తాజాగా వార్నర్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి స్టేడియంలోకి వస్తుండగా ఇంగ్లీష్ అభిమానులు నోరుపారేసుకున్నారు. చీటర్ అంటూ తిట్టగా దానికి వార్నర్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యింది.
వార్నర్ తనను చీటర్ అని ఇంగ్లీష్ అభిమానులు అన్నా వారిపై సీరియస్ కాకుండా వారిని చూస్తూ రెండు చేతులను పైకి ఎత్తి వావ్ అంటూ నవ్వుతూ వెళ్లిపోవడం క్రికెట్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అంతా వార్నర్ ను ప్రశంసిస్తుండగా.. ఇంగ్లీష్ అభిమానుల తీరును తప్పుపడుతున్నారు. వార్నర్ ఆవేశపడకుండా.. ఆత్మన్యూన్యతా భావానికి గురికాకుండా ఇలా స్ఫూర్తిగా మెలగడం చూసి అందరూ కొనియాడుతున్నారు.