Begin typing your search above and press return to search.

నేనేం హంతకుడినా? ఆ శిక్ష అన్యాయం.. క్రికెట్ ఆస్ట్రేలియాపై డేవిడ్ వార్నర్ అసహనం

By:  Tupaki Desk   |   22 Nov 2022 2:30 AM GMT
నేనేం హంతకుడినా? ఆ శిక్ష అన్యాయం..  క్రికెట్ ఆస్ట్రేలియాపై డేవిడ్ వార్నర్ అసహనం
X
ఒక చిన్న తప్పుడు ఏడాది నిషేధం.. ఉరిశిక్ష పడ్డ వారికి కూడా అప్పీలుకు అవకాశం.. కానీ ఆస్ట్రేలియా కెప్టెన్సీ పదవికి తనకు అర్హత లేదా? నేనేం హంతకుడినా? కెప్టెన్ కానివ్వరా? అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డుపై ఆ దేశ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నిప్పులు చెరిగాడు. క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు తీరుపై విసుగు చెందిన డేవిడ్ వార్నర్ సోమవారం తాను నేరస్థుడు కాదని.. క్రికెట్ ఆస్ట్రేలియా తనపై జీవితకాల కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేయాలని కోరాడు. ప్రతి ఒక్కరికి అప్పీల్ చేసే హక్కు ఉందని చెప్పాడు. ఈ డైనమిక్ ఓపెనర్ వార్నర్ 2018లో కేప్ టౌన్ సౌతాఫ్రికాతో మ్యాచ్ లో బాల్ టాంపరింగ్ వ్యవహారంలో అడ్డంగా దొరికాడు.

ఆస్ట్రేలియా తరుఫున ఎంట్రీ ఇచ్చినా కెప్టెన్ కాకుండా నిషేధించబడ్డాడు. కానీ సోమవారం ధృవీకరించబడిన క్రికెట్ ఆస్ట్రేలియా ప్రవర్తనా నియమావళికి సవరణ ప్రకారం.. అతను ఇప్పుడు మళ్లీ కెప్టెన్సీ రేసులో అభ్యర్థించగలడు. ప్రవర్తనా నియమావళి మార్పులు చేయాలని.. తనకు కెప్టెన్సీ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు.

"వారు నిషేధం విధించారని నేను అర్థం చేసుకున్నాను, కానీ ఒకరిని జీవితాంతం నిషేధించడం కొంచెం కఠినమైనదని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇది బయటకు రావడానికి ఒక అవకాశం మాత్రమే. వాస్తవానికి నేను నిజంగా పశ్చాత్తాపపడుతున్నానని మీకు తెలుసా. ఆస్ట్రేలియా క్రికెట్ సెటప్‌లోకి తిరిగి రావడానికి నేను కష్టపడ్డాను’ అంటూ వార్నర్ చెప్పుకొచ్చాడు. కొత్త నియమం ప్రకారం, ఒక ఆటగాడు తప్పనిసరిగా పశ్చాత్తాపం పడి.. మెరుగైన ప్రవర్తన రుజువు చేస్తే తిరిగి కెప్టెన్సీ ఇవ్వాలని రూల్స్ మార్చడానికి క్రికెట్ ఆస్ట్రేలియా సిద్ధమైంది.

ఆరోన్ ఫించ్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వార్నర్ కే కెప్టెన్సీ ఇస్తారని అనుకున్నారు. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం వార్నర్ ను పక్కనపెట్టి ప్యాట్ కమిన్స్ కు వన్డే కెప్టెన్సీ అప్పగించింది. దీంతోపాటు వార్నర్ పై ఉన్న కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. జీవితకాల నిషేధంపై ముగ్గురు సభ్యుల ప్యానెల్ కు వార్నర్ అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తూ సీఏ తాజాగా నిర్ణయం తీసుకుంది.

పాట్ కమిన్స్ ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్ట్ మరియు వన్డే కెప్టెన్. ఆరోన్ ఫించ్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. వార్నర్ నిషేధాన్ని ఎత్తివేయడం వలన ఫించ్ వైదొలిగితే టీ20 కెప్టెన్సీని తీసుకోవడానికి వార్నర్ ప్రధాన అభ్యర్థిగా చేస్తుంది.

స్టీవ్ స్మిత్, జోష్ హేజిల్‌వుడ్ మరియు అలెక్స్ కారీలతో కలిసి వార్నర్ కూడా కమిన్స్‌ను నియమించడానికి లేదా అతని వైస్-కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇది వార్నర్ బిగ్ బాష్ లీగ్ జట్టు సిడ్నీ థండర్‌కు నాయకత్వం వహించడానికి కూడా వీలు కల్పిస్తుంది.

వార్నర్ లాగే, స్మిత్ కూడా ఒక సంవత్సరం పాటు ఆడకుండా నిషేధించబడ్డాడు, కానీ అతని నాయకత్వ అనుమతి రెండేళ్లు మాత్రమే కొనసాగింది.ఆట యొక్క మూడు ఫార్మాట్లలో జాతీయ జట్టులో తమ స్థానాన్ని తిరిగి పొందేందుకు ఇద్దరు ఆటగాళ్లు తిరిగి పుంజుకొని ఆడారు. కానీ కెప్టెన్ ఛాన్స్ మాత్రం వీరికి దక్కడం లేదు.. దానిపైనే వార్నర్ ఫైర్ అయ్యాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.