Begin typing your search above and press return to search.

సన్ రైజర్స్ వేలంలోకి వదిలేయడంపై డేవిడ్ వార్నర్ స్పందన.. ముగిసిన కథ

By:  Tupaki Desk   |   1 Dec 2021 5:30 PM GMT
సన్ రైజర్స్ వేలంలోకి వదిలేయడంపై డేవిడ్ వార్నర్ స్పందన.. ముగిసిన కథ
X
ఐపీఎల్ లో రిటైయిన్ ముగిసింది. ముఖ్యంగా సన్ రైజర్స్ 'డేవిడ్ వార్నర్'ను వేలంలోకి వదిలేసింది. ఐపీఎల్ లోనే అత్యంత నిలకడగా ఆడే ఓపెనర్ గా పేరొందిన వార్నర్ ను భారమంటూ హైదరాబాద్ ఫ్రాంఛైజీ వదులుకుంది. కెప్టెన్ కేన్ విలయంసన్ ను 14 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకుంది. ఇక పవర్ హిట్టర్ అబ్దుల్ సమద్ (4 కోట్లు), పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ (4 కోట్లు)ని మాత్రమే రిటైన్ చేసుకున్న సన్ రైజర్స్ అగ్రశ్రేణి స్పిన్నర్ రషీద్ ఖాన్ ను సైతం వేలంలోకి వదిలేసింది. 68 కోట్ల పర్స్ మనీతో వేలంలోకి దిగనుంది.

ఐపీఎల్ 2014 సీజన్ వేలంలో రూ.5.5 కోట్లకు డేవిడ్ వార్నర్ ను కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత ఏడాదియే కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది. కెప్టెన్ గా టీంను ముందుండి నడిపించిన వార్నర్ ఐపీఎల్ లో 2016లో హైదరాబాద్ ను విజేతగా నిలిపాడు.

కానీ ఐపీఎల్ 2021 సీజన్ లో డేవిడ్ వార్నర్ విఫలమై జట్టుకు భారంగా మారాడు. సీజన్ మధ్యలోనే అతడికి కెప్టెన్సీ నుంచి సన్ రైజర్స్ తొలగించింది. ఆ తర్వాత తుది జట్టులో కూడా చోటివ్వకుండా అవమానించింది.

ఆ తర్వాత ఈ చర్యకు మానస్థాపం చెందిన బాధపడ్డ డేవిడ్ వార్నర్ ఇక సన్ రైజర్స్ తో తన బంధం ముగిసిందని ప్రకటించాడు. తాజాగా సన్ రైజర్స్ తనను అట్టిపెట్టుకోకుండా వేలంలోకి వదిలేయడంపై డేవిడ్ వార్నర్ స్పందించాడు. 'అధ్యాయం ముగిసింది. గత కొన్నేళ్లుగా సపోర్ట్ చేసిన అభిమానులకు, సన్ రైజర్స్ హైదరాబాద్ కు థ్యాంక్స్' అని వార్నర్ చెప్పుకొచ్చాడు.

కాగా ఐపీఎల్ 2022 సీజన్ వేలంలో డేవిడ్ వార్నర్ కోసం పంజాబ్ కింగ్స్ గట్టిగా పోటీపడే అవకావం ఉంది. కేఎల్ రాహుల్ ను వదిలేసిన ఆ జట్టు డేవిడ్ వార్నర్ తో దాన్ని భర్తీ చేయాలని చూస్తోంది.