Begin typing your search above and press return to search.
`ఫక్...సక్` అని వార్నర్ భార్యను తిట్టాడట!
By: Tupaki Desk | 10 March 2018 3:47 AM GMTదక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో సఫారీ వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్, ఆసీస్ డ్యాషింగ్ ఓపెనర్ వార్నర్ ల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. డికాక్ కుటుంబాన్ని బుష్ పిగ్ అని వార్నర్ స్లెడ్జింగ్ చేశాడు. దీంతో, కోపోద్రిక్తుడైన డీకాక్ .....టీ విరామ సమయంలో వార్నర్ భార్యను ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో, డ్రెస్సింగ్ రూమ్ మెట్ల వద్ద డీకాక్ ను కొట్టేందుకు వార్నర్ దూసుకెళ్లాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన ఐసీసీ ....క్రమ శిక్షణ చర్యల కింద వార్నర్ కు మూడు డీమెరిట్ పాయింట్లను జత చేయడంతోపాటు మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించింది. దాంతోపాటు డీకాక్ కు ఒక డీమెరిట్ పాయింట్ జత చేసి, మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. అయితే, తన భార్యను డీకాక్ ఏమన్నాడో అన్న విషయంపై వార్నర్ నోరు మెదపలేదు. తాజాగా, గురువారం నాడు ఆస్ట్రేలియా మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో వార్నర్ ....డీకాక్ అన్న మాటలను వెల్లడించాడు.
తన భార్యను ఉద్దేశిస్తూ డీకాక్ ``ఫక్..సక్`` అంటూ పరుష పదజాలాన్ని ఉపయోగించాడని, అందువల్లే తాను సంయమనం కోల్పోయి అతడిపైకి దూసుకెళ్లానని వార్నర్ తెలిపాడు. అంతకు ముందు రోజు తాను కాస్త ఆవేశానికి లోనయ్యానని, డీకాక్ ను తిట్టానని, సీసీటీవీ పుటేజ్ లో చూసి పశ్చాత్తపపడ్డానని వార్నర్ అన్నాడు. అయితే, డీకాక్ తన భార్య జోలికి వచ్చి, ఆమె గురించి తప్పుగా మాట్లాడటంతో అదుపు తప్పానని తెలిపాడు. ఆడవాళ్లపై అవమానకర వ్యాఖ్యలు, జాతి వివక్షపై వ్యాఖ్యలు చేయకూడదని, ఆ జోన్‌ను ఎవరూ టచ్ చేయకూడదని వార్నర్ చెప్పాడు. ఆటగాళ్ల మధ్య గొడవలు క్రికెట్ కు మంచివి కాదని ఇరు జట్లకు చెందిన పలువురు మాజీ క్రికెటర్లు హితవు పలికారు. ఇది జెంటిల్మన్ గేమ్ అని, దాని గౌరవాన్ని ఆటగాళ్లు ఇనుమడింపజేయాలని కోరారు. నేడు జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 243 పరుగులకు ఆలౌటైంది. వార్నర్ ఒక్కడే(63) పరుగులతో రాణించాడు.