Begin typing your search above and press return to search.

చావుకు ద‌గ్గ‌ర‌గా దావూద్ ఇబ్ర‌హీం

By:  Tupaki Desk   |   26 April 2016 5:55 AM GMT
చావుకు ద‌గ్గ‌ర‌గా దావూద్ ఇబ్ర‌హీం
X
మాఫియా డాన్ - ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీం చావుబతుకుల్లో ఉన్నాడా? ఆయన ఆరోగ్యం విషమంగా ఉందా? అంటే అవున‌నే అంటున్నాయి విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాలు. దావూద్ ప్ర‌స్తుతం గ్యాంగ్రీన్c(శరీరభాగం కుళ్లడం) అనే అరుదైన వ్యాధితో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. దీనికి తోడు దావూద్‌ కు బీపీ - షుగర్‌ ఎక్కువ కావడంతో ఆయన శరీరం కుళ్లిపోయిందని తెలియవచ్చింది. పాకిస్తాన్‌ లోని కరాచీలోని లియాఖత్ జాతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దావూద్‌ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. దావూద్ ప్ర‌స్తుతం చివ‌రి క్ష‌ణాల్లో ఉన్నార‌ని కూడా తెలుస్తోంది.

వైద్యులు ఆయ‌న‌కు చికిత్స చేసేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా బీపీ - షుగర్‌ ఎక్కువ కావడంతో రక్త ప్రసరణలో విపరీతమైన మార్పులు వ‌చ్చి కాళ్లకు ఆక్సిజన్‌ అందక శ‌రీరంలోని క‌ణ‌జాలం చాలా వ‌ర‌కు కుళ్లిపోయింద‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. గ్యాంగ్రిన్ వ్యాధి వ‌ల్ల ఉత్ప‌త్తి అయ్యే విష‌ప‌దార్థాలు దావూద్ శ‌రీరం మొత్తం వ్యాపించ‌డంతో కాళ్లు కుళ్లిపోయాయని, రెండు కాళ్లు తీసేయడం మినహా ఇంకేమీ చేయలేమని ఆస్పత్రి వర్గాలు చెప్పినట్లు సమాచారం.

దావూద్‌ ను ర‌క్షించుకునేందుకు ఆయ‌న రెండు కాళ్లు తీసేసినా కూడా ఆయ‌న బ‌త‌క‌డం క‌ష్ట‌మ‌ని...ఆయ‌న చాలా త‌క్కువ రోజులే బ‌తుకుతార‌ని క‌రాచీ వ‌ర్గాలు చెపుతున్నాయి. 1993 ముంబాయి పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు అయిన దావూద్‌ ఇబ్రహీంను అప్పగించాలని పాకిస్తాన్‌ ను భారత ఎంతో కాలంగా డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. దావూద్ మ‌ర‌ణిస్తే ఈ డాన్‌ ను భార‌త్‌ కు తీసుకురావాల‌ని మ‌న‌దేశ ప్ర‌భుత్వం ఎప్ప‌టి నుంచో చేస్తోన్న ప్ర‌య‌త్నాలు వృథా అయిన‌ట్టే అనుకోవాలి.

ఇక దావూద్‌ కు చాలా సీక్రెట్‌ గా ర‌క్ష‌ణ ఇస్తున్న పాకిస్తాన్ ఇప్పటి వరకు దావూద్‌ తమవద్ద లేరని బుకాయిస్తోంది. అయితే ప్రస్తుతం దావూద్‌ మరణిస్తే ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. దావూద్ ఆరోగ్య ప‌రిస్థితిపై వ‌స్తున్న వార్త‌లు నిర్దారించుకునేందుకు భార‌త ప్ర‌భుత్వ వ‌ర్గాలు సీక్రెట్‌ గా విచార‌ణ చేస్తున్నాయి.