Begin typing your search above and press return to search.

దావూద్ తో ఫోన్ మాట్లాడిన సూపర్ స్టార్?

By:  Tupaki Desk   |   11 Sept 2016 10:16 PM IST
దావూద్ తో ఫోన్ మాట్లాడిన సూపర్ స్టార్?
X
దావూద్ ఇబ్రహీం.. భారతీయులకు ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు. ముంబై బాంబు పేలుళ్ల ద్వారా భారతదేశాన్ని ఒక కుదుపు కుదిపిన అండర్ వరల్డ్ డాన్. ప్రస్తుతం పాకిస్థాన్ లో తలదాచుకుంటున్న ఈ అండర్ వరల్డ్ డాన్ తో బాలీవుడ్ కు సంబందాలు ఉన్నాయనే వార్తలు పాత విషయాలే అయినా...తాజాగా భారత ఇంటిలిజెన్స్ విభాగానికి తెలిసిన విషయాలు మాత్రం చాలా కొత్తవి.. అధికారికమైనవి అనే చెప్పాలి.

భారత ప్రజలు టిక్కెట్లు కొన్న సొమ్ము - నిర్మాతల నుంచి భారీ స్థాయిలో రెమ్మూనరేషన్ల రూపంలో సంపాదించిన డబ్బు ఉన్న ఒక బడా సూపర్ స్టార్.. అలా సంపాదించిన సొమ్మునంతా విదేశాలకు తరలించి అక్కడ ఆస్తులు భారీగా కూడగట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి అండర్ వరల్డ్ డాన్ - భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం సాయం తీసుకున్నట్టు తాజాగా తెలిసింది. ఇదే సమయంలో దావూద్ తో చెట్టాపట్టేలేసుకుని కూడా ఆ సూపర్ స్టార్ తిరుగుతున్నారన్న వార్త నిఘావర్గాలకు తెలియడం ఇప్పుడు సెన్సేషన్ విషయం. ఇంటెలిజెన్స్ వర్గాల తాజా కథనం ప్రకారం.. పాకిస్థాన్ లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ తో ఈ బడా స్టార్ తో పాటు భారతదేశానికే చెందిన పలువురు రాజకీయనేతలు, వ్యాపార వేత్తలు నిత్యం ఫోన్ సంభాషణలు చేస్తుంటారట. ఈ మేరకు కొన్ని కీలక సంభాషణలు ఇంటిలిజెన్స్ బ్యూరో చేతికి చిక్కాయి.

కాగా... 90వ దశకంలోనే భారత్ నుంచి పారిపోయిన దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ విషయంపై భారతదేశం ఎన్నో సాక్ష్యాలు చూపించింది. అయినప్పటికీ.. దావూద్ పాక్ లో లేడని అక్కడి ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రకటిస్తున్న సంగతి తెలిసింది. ఇదే సమయంలో పాకిస్థాన్ పారిపోయినప్పటికీ భారత్ లోని అండర్ వరల్డ్ పై మాత్రం దావూద్ తన పట్టు కొనసాగిస్తూనే ఉన్నాడనటానికి దీన్ని మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు.