Begin typing your search above and press return to search.
మోడీ మాస్టర్ స్ట్రోక్ ఎలా ఉంటుందంటే..
By: Tupaki Desk | 5 Jan 2017 9:48 AM GMTఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడని అందరికి తెలిసిన డైలాగే. దావూద్ ఇబ్రహీం లాంటి దేశ ముదురుకు కరెంటు షాక్ కొట్టించటమే కాదు.. అయ్యగారి ఆర్థిక కూసాలు కదిలిపోయేలా దెబ్బేసే మొనగాడు ఎవరంటే అంటూ కొత్త డైలాగ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. రెండు రోజలు కిందట యూఏఈలోని అండర్ వరల్డ్ డాన్ దావూద్ కు చెందిన రూ.15వేల కోట్లు విలువ చేసే ఆస్తుల్ని సీజ్ చేసిన ఉదంతం తెలిసిందే.
దీనికి మొత్తంగా కారణం ఎవరో తేలిపోవటమే కాదు.. దావూద్ కు ఈ రేంజ్లో దెబ్బేయటంలో కర్త.. కర్మ.. క్రియ అన్నీ ప్రధాని మోడీనేనని అన్న రీతిలో తాజాగా బీజేపీ స్వయంగా తమ నాయకుడి ఘనతను ట్వీట్ రూపంలో చాటి చెప్పుకోంటోంది. ప్రస్తుతం పాకిస్థాన్ లో తలదాచుకుంటున్న దావూద్ కు పాక్ తో సహా.. భారత్.. యూఏఈలతోపాటు పలు దేశాల్లో వేలాది కోట్ల ఆస్తులు ఉన్నాయి.
దావూద్ పై గురి పెట్టిన మోడీ సర్కారు.. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అతడి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు చెబుతుంటారు. ముంబయి బాంబుపేలుళ్ల ప్రధాన సూత్రధారి అయిన దావూద్ ను సంగతి తేల్చాలన్నది మోడీ అజెండాలలో ప్రధానమైనదిగా చెబుతుంటారు. 257 మంది ప్రాణాలు కోల్పోవటానికి కారణమైన దావూద్ అంతు చూసే వరకూ మోడీ నిద్రపోరని బీజేపీ నేతలు పదే పదే చెబుతుంటారు. అయితే.. ప్రధానిగా మోడీ పదవిని చేపట్టి రెండున్నరేళ్లుగడుస్తున్నా ఇప్పటివరకూ చేసిందేమీ లేదన్న విమర్శలు వినిపిస్తున్న వేళ.. అండర్ వరల్డ్ డాన్ ఆస్తుల్ని సీజ్ చేస్తూ యూఏఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అయితే.. ఇదంతా మోడీ ఘనతేనని.. దావూద్ కు సంబంధించిన కీలక పత్రాలు యూఈఏకి అందించే విషయంలో మోడీ సర్కారు చురుకైన పాత్ర పోషించిందని.. అందువల్లే యూఏఈ ప్రభుత్వం దావూద్ ను దెబ్బేస్తూ వేలాది కోట్లఆస్తుల్ని సీజ్ చేసిందని చెబుతున్నారు. దావూద్ పై మోడీ మాస్టర్ స్ట్రోక్ గా కమలనాథులు అభివర్ణిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/