Begin typing your search above and press return to search.
దావూద్ ఇబ్రహీం కొడుకు బెంగళూరులో?
By: Tupaki Desk | 20 Nov 2015 7:40 AM GMTపాకిస్థాన్ లో కాలుమీద కాలేసుకుని సర్వసుఖాలు అనుభవిస్తున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై వస్తున్న తాజా పుస్తకం విడుదలకు ముందే సంచలనంం రేపుతోంది. శనివారం విడుదల కానున్న ఈ పుస్తకం రిలీజైతే ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.సీబీఐ డిప్యూటీ కమిషనర్ గా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన విశ్రాంత పోలీసు బాస్ నీరజ్ కుమార్ డయల్ డి ఫర్ డాన్ పేరుతో రాసిన ఈ పుస్తకం సంచలనాలకు వేదిక కానుంది. ఈ పుస్తకావిష్కరణ నేపథ్యంలో నీరజ్ కూడా అందులోని కొన్ని అంశాలనూ చూచాయగా చెప్తూ ముందే ఆసక్తి రేపుతున్నారు. అందులో భాగంగానే ఆయన పలు విషయాలు వెల్లడిస్తున్నారు. దావూద్ కు అలనాటి బాలీవుడ్ అందాల నటి మందాకినికి మధ్య సంబంధం ఉందని... వారిద్దరూ పెళ్లికూడా చేసుకున్నారని చెబుతుంటారు. ఇంతవరకు ప్రజలకు ఈ విషయం మాత్రమే తెలుసు. అయితే... దావూద్ - మందాకినిల కుమారుడు ఇండియాలోనే ఉన్నాడని... అదీ బెంగళూరులో ఇప్పుడు ఉన్నాడని నీరజ్ కుమార్ చెప్పడం దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తోంది.
దావూద్ పై తాను రాసిన పుస్తకావిష్కరణ నేపథ్యంలో ఒక రోజు ముందే నీరజ్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన దావూద్ కుమారుడు బెంగళూరులో ఉన్నట్లు వెల్లడించారు. 1993 ముంబయి పేలుళ్ల అనంతరం దావూద్ దుబాయికి, అక్కడి నుంచి పాకిస్తాన్ కు పారిపోయాడు. మందాకిని కూడా ఆ తరువాత దావూద్ ను చేరుకుందట. అయితే... వారిద్దరి కుమారుడు మాత్రం ప్రస్తుతం బెంగళూరులో ఉన్న మందాకిని చెల్లెలి వద్ద నివిసిస్తున్నట్లు నీరజ్ వెల్లడించారు. ఉద్యోగంలో ఉండగా దావూద్ తో తాను మూడుసార్లు మాట్లాడినట్లు నీరజ్ చెబుతున్నారు. అంతేకాదు... తన రిటైర్ మెంట్ కు ముందు దావూద్ తనకు ఫోన్ చేశాడని... నీరజ్ సాబ్... రిటైర్ అయిపోయే ముందు కూడా నన్ను వెంటాడుతున్నారు సార్ మీరు.. అంటూ చాలా మామూలుగా మాట్లాడాడానని నీరజ్ వెల్లడించారు. రేపు ఈ పుస్తకం రిలీజ్ అయితే ఇంకెన్ని సంచలన విషయాలు ప్రజలకు తెలుస్తాయో చూడాలి.