Begin typing your search above and press return to search.
అఫ్రిదీకి అండర్ వరల్డ్ డాన్ బెదిరింపులు!
By: Tupaki Desk | 15 Oct 2016 4:42 AM GMTఅండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.. పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రీదిని బెదిరించాడా? జావెద్ మియాందాద్ తో అఫ్రీది మాటల యుద్ధం నేపథ్యంలో దావూద్ ఈ హెచ్చరిక చేశాడా? మియాందాద్ పై నోరు పారేసుకోవద్దని హెచ్చరించాడా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా ఈ మేరకు జాతీయ - అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 1992 ప్రపంచ కప్ విజేత జావెద్ పై నోరు పారేసుకోవద్దని దావూద్ ఇబ్రహ్మీం ఈ నెల 12న అఫ్రీదికి ఫోన్ లో హుకుం జారీ చేశాడట. ఈ విషయంలో మరోమాట మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించాడట.
"డబ్బుల కోసమే అఫ్రిది చివరి మ్యాచ్ ఆడాలనుకుంటున్నాడు.. షాహిద్ అఫ్రిది ఓ దొంగ.. మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడు.. కాసుల కోసం దేశాన్ని అమ్మేసిన దుర్మార్గుడు".. అంటూ కొన్ని రోజుల క్రితం అఫ్రీది పై విరుచుకుపడ్డాడు జావేద్ మియాందాద్. అనంతరం స్పందించిన అఫ్రిదీ... "మియాందాద్ గొప్ప క్రికెటర్.. ఆయన ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేస్తాడని ఊహించలేదు.. అందుకే ఎంత ఆటగాడైనా ఇమ్రాన్ ఖాన్ లాగా మంచిపేరు సంపాదించుకోలేకపోయాడు.. మియాందాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను" అని అఫ్రిదీ స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంపై అఫ్రిదీకి అండర్ వరల్డ్ డాన్ నుంచి బెదిరింపులు వచ్చాయట. ఈ విషయం ఇప్పటితో ఆపకుండా మియాందాద్ పై నోరు జారితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడట.
ఈ విషయాలపై స్పందించిన వసీం అక్రం... ఈ వివాదాలకు ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని - జావెద్ - షాహిద్... ఇద్దరూ తనకు, పాకిస్థాన్ కు ఎంతో కావాల్సిన వ్యక్తులని అన్నాడు. వారిద్దరి మధ్య జరిగిందేదైనా సరే త్వరలో సమసిపోతుందని ఆశిస్తున్నానని ఈ మేరకు ఒక ట్వీట్ చేశాడు అక్రం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/