Begin typing your search above and press return to search.
మనం ఇద్దరికి ప్రాణభిక్ష పెడితే.. పాక్ ఉరేసిందే
By: Tupaki Desk | 11 April 2017 9:20 AM GMTదాయాదితో ఎంత సఖ్యతతో ఉండాలని ప్రయత్నించినా.. కుక్క తోక వంకర మాదిరిగా వ్యవహరించే పాక్ బుద్ధి మరోసారి బయటపడింది. గూఢచర్యం ఆరోపణలపై గత ఏడాది అరెస్ట్ అయిన మనోడు కులభూషణ్ జాదవ్ కు తాజాగా పాక్ కోర్టు ఉరిశిక్ష విధించటం తెలిసిందే. భారత రాజకీయాల్ని వేడెక్కిస్తున్న ఈ ఉదంతంపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నారు. పాక్ నిర్ణయంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసినా.. చేయాల్సిన రీతిలో ఒత్తిడి చేయటం లేదన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. మనోడికి పాక్ కోర్టు ఉరిశిక్ష విధించటానికి ఒక్కరోజు ముందు మన తీర ప్రాంత గస్తీ దళం ఇద్దరు పాకిస్థానీజాలర్ల ప్రాణాల్ని కాపాడిన వైనం బయటకు వచ్చింది.
సముద్రంలో కొట్టుకు పోతున్న పాకిస్థాన్ జాలర్లను రక్షించిన వైనం చూసినప్పుడు.. మనం దాయాది పట్ల వ్యవహరించే ధోరణికి.. వారు మన పట్ల వ్యవహరించే తీరుకు తేడా ఇట్టే తెలుస్తుంది. పాక్ కోస్టుగార్డుకు చెందిన ఒక చిన్నబోటు తమ జలాల్లో చేపల వేటను పరిశీలిస్తూ.. పొరపాటున గుజరాత్ తీరంలోని భారత్ భూభాగంలోకి ప్రవేశించింది. ప్రధానబోటుతో విడిపోయిన ఈ బోటు సముద్రంలో మునిగింది. ఈ సమయంలో బోటులో ఆరుగురు జాలర్లు ఉన్నారు. వారిని కాపాడాలంటూ పాక్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ న్యూఢిల్లీలోని భారత నేవీ అధికారుల్ని కోరి.. సాయం కోసం అర్థించారు.
వెనువెంటనే బరిలోకి దిగిన భారత నేవీ బృందం వారి కోసం గాలింపు చర్యల్ని చేపట్టింది. ఈ క్రమంలో ఇద్దరు జాలర్లను రక్షించగా.. నలుగురు అప్పటికే మరణించారు. తాము కనుగొన్న ఇద్దరు జాలర్లకు వెంటనే వైద్యసాయం అందించి.. వారి ప్రాణాలు పోకుండా నిలబెట్టారు.వారి బాగోగులు చూసుకున్నారు. ఇదిలా ఉంటే.. భారత్ కు చెందిన కుల్ భూషన్ జాదవ్ ను గూఢాచారి అన్న పేరుతో ఇరాన్ నుంచి అక్రమంగా తీసుకొచ్చి.. అతను పాక్ గడ్డ మీద రా తరఫున గూఢచర్యం చేస్తున్నారంటూ ఆరోపణలు మోపి.. ఉరిశిక్ష విధించటంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. మనమేమో.. దాయాదికి చెందిన వారి ప్రాణాలు కాపాడేందుకు అంతగా ప్రయత్నిస్తుంటే.. పాకిస్థానీయులు మాత్రం దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తీరుపై పలువురు మండిపడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/