Begin typing your search above and press return to search.
17ఏళ్ల వారికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ కి డీసీజీఐ ఆమోదం
By: Tupaki Desk | 20 Aug 2021 10:30 AM GMTదేశంలో మరో కరోనా వైరస్ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఫార్మ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన సింగిల్ డోస్ కోవిడ్ టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం పొందింది. బయోలాజికల్ ఈ లిమిటెడ్ సహకారంతో భారతీయులకు సింగిల్-డోస్ కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ముఖ్యమైన కరోనాపై మైలురాయి అని జాన్సన్ అండ్ జాన్సన్ ఓ ప్రకటనలో తెలిపింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ సమర్థత, భద్రతా డేటాపై ఆధారపడి అత్యవసర వియోగానికి ఆమోదం లభించింది.. మా సింగిల్-డోస్ వ్యాక్సిన్ అన్ని ప్రాంతాలలో నిర్వహించిన అధ్యయనాల్లో కరోనా తీవ్రమైన వ్యాధిని నివారించడంలో 85 శాతం ప్రభావవం చూపింది. టీకా తీసుకున్న 28 రోజుల తర్వాత ఆసుపత్రిలో చేరడం, మరణాల ముప్పును తగ్గించింది అని వెల్లడించింది.
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగేందుకు చర్యలు తీసుకుంటుంది భారత ప్రభుత్వం, దేశీయ వ్యాక్సిన్లతో పాటు విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇస్తూ వస్తోంది. ఇప్పటి వరకు 18 ఏళ్ల పైబడినవారికి మాత్రమే వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా 18 ఏళ్లకు దిగువ వయస్సున్నవారిపై మాత్రం కొన్ని ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ దశలో భారత్ బయోటెక్ రూపొందించిన వ్యాక్సిన్ ముందుంజలో ఉంది. మరోవైపు, పెద్దలకు సింగిల్ డోస్‌తో వ్యాక్సిన్ రూపొందించి పంపిణీ చేస్తోంది అమెరికా ఫార్మా దిగ్గజమైన జాన్సన్ అండ్ జాన్సన్.
ఇప్పటికే భారత్‌లో ఈ సంస్థ అత్యవసర వినియోగానికి చేసుకున్న దరఖాస్తుకు ఆమోదం లభించింది. తాజాగా ఆ సంస్థ 12 నుంచి 17 ఏళ్ల వయస్సు పిల్లల కోసం తయారు చేసిన సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు కూడా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం లభించింది. కౌమారదశ పిల్లలకు కరోనా వైరస్ కి వ్యతిరేకంగా సింగిల్ షాట్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి కోరుతూ, గతంలో దరఖాస్తు చేసుకోగా ఆ సంస్థ అభివృద్ధి చేసిన సింగిల్ షాట్ కొవిడ్ వ్యాక్సిన్ మూడవ దశలో కోవిడ్ పై 85 శాతం సామర్ధ్యం పనిచేస్తోందని తేలపడంతో ఈ నిర్ణయం తీసుకుంది డీసీజీఐ.
ఇక, ఈ సింగల్ డోస్ కరోనా వైరస్ వ్యాక్సిన్ దేశంలో కరోనా వైరస్ నియంత్రణకు ఉపయోగపడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి చెప్పారు. కరోనా మహమ్మారిని అంతం చేయడంలో సహాయపడటానికి కరోనా వ్యాక్సిన్ ముఖ్యమైన ముందడుగు అని జాన్సన్ అండ్ జాన్సన్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. 18 సంవత్సరాల వయస్సు లోపు వారికి కరోనాను నివారించడానికి భారత ప్రభుత్వం జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వైరస్ సింగిల్-డోస్ టీకా అత్యవసర వినియోగ అధికారాన్ని జారీ చేసినందుకు మేం సంతోషిస్తున్నాం అంటూ హర్షం వ్యక్తం చేశారు.