Begin typing your search above and press return to search.
కరోనా డ్రగ్ విషయంలో గ్లెన్ మార్క్ ఫార్మాకు నోటీసులు
By: Tupaki Desk | 20 July 2020 12:10 PM GMTడగ్ర్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) తాజాగా కరోనా డ్రగ్ ను తయారు చేసిన గ్లెన్ మార్క్ ఫార్మా కంపెనీకి నోటీసులు పంపించింది. యాంటీ వైరల్ ఫ్యాబీ ఫ్లూకు ఔషధానికి సంబంధించి తప్పుడు క్లెయిములు చేయడం.. ఈ వైరల్ ఔషధం ధర విషయంలో ఓ ఎంపీ ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు పంపించింది.ముంబైకి చెందిన గ్లెన్ మార్క్ కంపెనీపై డ్రగ్ ఫ్యాబీ ఫ్లూ పై ఫిర్యాదు ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు.
ఫ్యాబీ ఫ్లూ ధర 122 పిల్స్ కలిగిన మాత్రల ధర ఏకంగా రూ.12500గా గ్లెన్ మార్క్ నిర్ణయించింది. ఈ ట్యాబ్లెట్స్ ధరను పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీ ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఇది అధిక బీపీ, షుగర్ వాళ్లకు బాగా పనిచేస్తుందనే ప్రచారం తప్పు అని.. దీనిపై సమగ్ర అధ్యయనం చేయాలని ఎంపీ డీసీజీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో జూలై 17న నోటీసులు పంపించారు.
కరోనా రోగులకు మొదటిరోజు ఈ గ్లెన్ మార్క్ యాంటీ వైరల్ మాత్రలను 18 చొప్పున ఇస్తారు. 2-14వ రోజుల మధ్య 8 ట్యాబ్లెట్లను ఉపయోగిస్తారు.
అయితే ఇటీవల దీని ధరను తగ్గిస్తున్నట్టు గ్లెన్ మార్క్ తెలిపింది. దీని ధరను తొలుత రూ.103గా నిర్ణయించారు. ఇప్పుడు 27శాతం తగ్గిస్తూ రూ.75కే అందుబాటులోకి తెస్తున్నారు. కరోనా వైరస్ లక్షణాలు స్వలంగా ఉంటే దీన్ని వినియోగిస్తారు..