Begin typing your search above and press return to search.

డీసీపీ వేధింపులు పెరిగిపోయాయి .. అందుకే సూసైడ్ అటెమ్ట్ !

By:  Tupaki Desk   |   11 Nov 2021 11:30 AM GMT
డీసీపీ వేధింపులు పెరిగిపోయాయి .. అందుకే  సూసైడ్ అటెమ్ట్ !
X
విజయవాడలో ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దిశ పోలీస్ స్టేషన్‌ లో పనిచేస్తున్న ఆయన తన నివాసంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. దిశ పోలీస్ స్టేషన్‌ లో పనిచేస్తున్న ఎస్సై నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. కుటుంబ సభ్యులు సకాలంలో గమనించి ఆయన్ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు.. ఎస్సైకి ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించారు. విజయవాడ దేవీనగర్‌లో ఉన్న సొంత ఇంటిలోనే ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

దిశ పోలీస్ స్టేషన్‌ లో ఎస్ ఐ గా పనిచేస్తున్న విజయ్ కుమార్, తన నివాసం లోనే మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్ ఐ కి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యలు ప్రకటించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటన తర్వాత, అనంతరం ఎస్ ఐ స్పందించారు. దిశ ఏసీపీ నాయుడి వేధింపులతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్టు సీపీకి లేఖ రాశారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పలు లేఖ ద్వారా పలు వివరాలను తెలిపారు. దిశ ఏసీపీ నాయుడి వేధింపుల కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. ఏసీపీ నాయుడు పెట్టే బాధలు భరించలేక చనిపోవడానికి సిద్ధపడినట్లు వెల్లడించారు. నిజమైన కేసును తప్పుడు కేసుగా తనతో చేయిస్తున్నారని, తాను ప్రశ్నించినందుకు తనపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కష్టపడి పనిచేస్తున్నా ఇబ్బందులకు గురిచేస్తున్నారని , ఏసీపీ పెట్టే బాధలు భరించలేక ఆత్మహత్యాయత్నానికి యత్నించినట్లు ఎస్ ఐ లేఖ లో పొందుపరిచారు. కాగా, విజయవాడ పోలీసు శాఖలో ఈ ఘటన కలకలం రేపింది. దీనితో పూర్తి వివరాలు రాబట్టేందుకు శాఖాపరమైన దర్యాప్తునకు సీపీ శ్రీనివాసులు జారీ చేశారు.