Begin typing your search above and press return to search.
బెజవాడలో కారులో డెడ్ బాడీస్.. హైదరాబాద్ శివారులో నగ్నంగా మృతదేహాలు
By: Tupaki Desk | 4 May 2022 5:13 AM GMTఒకే రోజు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనూహ్యంగా తెర మీదకు వచ్చిన ‘డెడ్ బాడీస్’ పలు సందేహాలతో పాటు.. సంచలనంగా మారాయి. ఈ రెండు ఉదంతాలు షాకింగ్ గా మారాయి. దీనికి కారణం.. ఈ రెండు ఉదంతాల్లోని విలక్షణతేగా చెప్పాలి. ఇందులో మొదటిది ఏపీలోని విజయవాడలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారులో డెడ్ బాడీ ఉండటంతో షాక్ తింటున్నారు.
బెజవాడలోని డీమార్ట్ వద్ద రోడ్డు పక్కన ఏపీ 37 బీఏ 5456 నంబరు ఇండికా కారు నుంచి దుర్వాసన వస్తోంది. దీంతో.. కారును నిశితంగా చూస్తే.. కుళ్లిపోయే దశలో ఒక మృతదేహాం ఉండటంతో షాక్ తిన్న పరిస్థితి. ఈ వివరాల్ని పోలీసులకు సమాచారం అందించటం.. వారు నేరం జరిగిన ప్రాంతానికి వచ్చి పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. ఈ కారు మూడు రోజులుగా రోడ్డు పక్కనే ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. కారు నెంబరు ఆధారంగా ఏమైనా వివరాలు బయటకు వస్తాయన్న ఉద్దశంతో విచారణ జరుపుతున్నారు.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ శివార్లలో రెండు మృతదేహాలు నగ్నంగా పడి ఉండటం.. ఈ రెండు డెడ్ బాడీస్ చూసినప్పుడు.. చంపటానికి ముందు తీవ్రంగా గాయపర్చినట్లుగా కనిపిస్తోంది. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోన రెండు డెడ్ బాడీస్ వెలుగులోకి వచ్చి సంచలనంగా మారిందీ ఉదంతం.
కంపచెట్ల మధ్య గుర్తు పట్టలేని స్థితిలో నగ్నంగా ఉన్న యువతి.. యువకుడి డెడ్ బాడీలను స్థానికులు గుర్తించారు. చెట్లకు కల్లు తీసే క్రమంలో ఒక టూవీలర్ కనిపించటం.. మూడు రోజులు నుంచి అక్కడే ఉండటంతో అనుమానం వచ్చిన ఆ వ్యక్తి.. వాహనం వద్దకు వెళ్లి చూడగా.. అక్కడే రెండు మృతదేహాలు నగ్నంగా పడి ఉండటంతో ఆదుర్దాకు గురై.. పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు ఈ రెండు డెడ్ బాడీస్ ఎవరివన్న విషయంపై స్పష్టత వచ్చేసింది. డెడ్ బాడీ వద్ద లభించిన ఆధారాల ప్రకారం చూస్తే.. వీరిద్దరూ చిలకలగూడ పీఎస్ పరిధిలోని 22 ఏళ్ల యశ్వంత్ అని.. మహిళ 28ఏళ్ల జ్యోతిగా గుర్తించారు. జ్యోతికి ఇద్దరు పిల్లల తల్లిగా చెబుతున్నారు. ఆమె భర్త స్థానికంగా వ్యాపారం చేస్తుంటారని చెబుతున్నారు. తన సోదరుడు యశ్వంత్ మూడు రోజులుగా కనిపించకపోవటంతో చిలకలగూడ పోలీస్ స్టేషన్ వద్ద ఫిర్యాదు చేశామన్నారు. జ్యోతి ఎవరో తమకు తెలీదని.. శత్రువులు లేరని చెబుతున్నారు.. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందన్న మాట వినిపిస్తోంది.
యశ్వంత్ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తుంటాడని చెబుతున్నారు. నగ్నంగా ఉన్న రెండు మృతదేహాలను చూసినప్పుడు దారుణమైన రీతిలో హింసకు గురి చేసినట్లుగా చెబుతున్నారు. జ్యోతి ముఖం మీద బండరాయిని మోది హతమార్చగా.. యశ్వంత్ మర్మాంగంపై దాడి చేసి ఛిద్రం చేయటం గమనార్హం. మొత్తంగా ఈ రెండు హత్యలు తీవ్రమైన ఆగ్రహంతో చేసినట్లుగా చెబుతున్నారు. ఈ అనుమానాస్పద హత్యలకు కారణం ఏమిటన్నది పోలీసుల విచారణలో తేలనుంది.