Begin typing your search above and press return to search.
సరయూ నదిలో గుట్టలు గుట్టలుగా మృతదేహాలు !
By: Tupaki Desk | 27 May 2021 7:30 AM GMTబిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లో గంగానది, యమునా నదిలో మృతదేహాలు కొట్టుకువచ్చిన ఘటనల గురించి ఇంకా పూర్తిగా మరిచిపోకముందే ఉత్తరాఖండ్ లోని పిథౌర్ గఢ్ జిల్లాలో సరయూ నది ఒడ్డున డజన్ల కొద్దీ మృతదేహాలు కొట్టుకొచ్చాయి. మృతదేహాలు కరోనా మృతులవేనంటూ స్థానికంగా ఆందోళనకు గురవుతున్నారు. మృతదేహాలు కనిపించిన ప్రదేశానికి 30 కిలోమీటర్ల దూరంలోనే జిల్లా కేంద్రం ఉంది. కరోనా సెకెండ్ వేవ్ వ్యాప్తి మధ్య గంగతోపాటు ఇతర నదుల ఒడ్డున మృతదేహాలు కనిపించడం ఇటీవలి కాలంలో సంచలనంగా మారింది.
తాగునీటి సరఫరా కోసం ఈ నది నీటినే వినియోగిస్తుంటారు. ఈ నీరు కలుషితం కావడంతో కరోనా వ్యాప్తి చెందుతుందని స్థానికులు భయపడుతున్నారు. ప్రస్తుతం జిల్లా పరిధిలో కరోనా కేసులు భారీగానే ఉన్నాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ పంకజ్ చందోలా మాట్లాడుతూ.. సరయూ నదిలో కనిపించిన మృతదేహాలు పిథోర్ గఢ్ కు చెందినవి కాదని స్పష్టం చేశారు. మృతదేహాలను ఇంకా గుర్తించలేదని, ఎక్కడి నుంచి వచ్చాయో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.