Begin typing your search above and press return to search.
కార్పొరేట్ కరోనా దందా.. ఫీజు చెల్లిస్తేనే మృతదేహం!
By: Tupaki Desk | 18 May 2021 10:31 AM GMTకరోనా మహ్మమ్మారి ఓ వైపు ప్రాణాలు తీస్తుండగా మరోవైపు బాధిత కుటుంబాలను ఆర్థికంగా కుంగదీస్తోంది. వైరస్ బాధితులను చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేర్చితే ఇక అంతే. ఫీజులు కట్టలేక చేతులెత్తేయడమే ఉత్తమం అన్న పరిస్థితులు వచ్చాయి. మహబూబాబాద్ జిల్లాకు చెందిన శ్రీధర్ అనే వ్యక్తికి కరోనా సోకింది. అక్కడ ఆక్సిజన్ సదుపాయం లేకపోవడం హైదరాబాద్ కు తీసుకువచ్చారు.
దిల్సుఖ్నగర్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అందుకు గాను ఐసీయూ పడక ఖర్చు రూ.85 వేలు, మందులు రూ.20వేలను మే16 వరకు చెల్లించినట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. అయినా ప్రాణాలను కాపాడలేదుని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో రెమిడెసివర్ ఇంజెక్షన్ రూ.50వేలు, ప్లాస్మాకు రూ.30వేలు వసూలు చేసిందని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం రూ.పదిలక్షలకు పైగా ముట్టజెప్పినట్లు వెల్లడించారు.
11 రోజుల్లో దాదాపు రూ.11 లక్షలు వసూలు చేసిన యాజమాన్యం... చివరకు చేతులెత్తేసిందని వాపోయారు. చివరకు మృతదేహాన్ని ఇవ్వడానికీ డబ్బులు అడుగుతున్నారని ఆరోపించారు. ఇంకా రూ.3.5 లక్షలు చెల్లిస్తేనే మృతదేహం ఇస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇవ్వడానికి తమ దగ్గర ఏం మిగలలేదని కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై ఆస్పత్రి సీఈవో ప్రమోద్ స్పందించారు. డబ్బుల కోసం తమ ఆస్పత్రి వర్గాలు ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేశారు.
కరోనా విపత్కర వేళ కార్పొరేట్ ఆస్పత్రుల తీరుకు ఈ ఘటన కేవలం ఒక ఉదహరణ. రాష్ట్రంలో ఇలాంటివి నిత్యం వెలుగుచూస్తున్నాయి. కాగా గరిష్ఠ ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం... వాటిని మాటలకే పరిమితం చేసింది. ఆపద కోసం ఆస్పత్రికి పోతే దానినే ఆసరా చేసుకొని చివరకు మృతదేహం ఇవ్వాలన్నా డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు వాపోయారు.