Begin typing your search above and press return to search.

అర్ధరాత్రి తో ముగుస్తున్న గడువు .. జేఏసీ నేతలు ఏంచెప్తున్నారంటే ?

By:  Tupaki Desk   |   5 Nov 2019 7:05 AM GMT
అర్ధరాత్రి తో ముగుస్తున్న గడువు .. జేఏసీ నేతలు ఏంచెప్తున్నారంటే ?
X
తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేటికీ 32 రోజులకి చేరింది. కార్మికుల డిమాండ్స్ పరిష్కరించాలని, అలాగే ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయాలనీ ఆర్టీసీ కార్మికులు సమ్మె లోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ .. ఆర్టీసీ కార్మికులది అర్థరహితమైన సమ్మె , తెలంగాణ ఏర్పడిన తరువాత వారికీ అడిగిన కంటే కొంచెం ఎక్కువగానే జీతం పెంచామని, అయినా కూడా యూనియన్ నేతల మాటలు విని అనవసరంగా సమ్మెలోకి వెళ్లారు అంటూ రాష్ట్రంలో ప్రైవేట్ వారికి పర్మిషన్ ఇస్తూ 5100 రూట్లని వారికీ కేటాయించారు. అలాగే ఆర్టీసీ కార్మికులకు చివరి సరిగా ఈ నెల5 అర్ధరాత్రి వరకు డ్యూటీ లో చేరడానికి డెడ్ లైన్ పెట్టాడు.

అప్పటిలోగా కార్మికులు డ్యూటీ లో చేరకపోతే ఇక రాష్ట్రంలో ఆర్టీసీ కథ ముగిసినట్టే అని చెప్పారు. మొత్తం రాష్ట్రాల్లోని అన్ని రూట్లని ప్రైవేట్ వారికి అప్పగిస్తాం అని తెలిపారు. ఈ డెడ్ లైన్ ఈ రోజు అర్ధరాత్రి తో ముగియబోతుంది. ఇప్పటివరకు రాష్ట్రం అంతా కలిపి 26 మంది మాత్రమే విధుల్లో చేరారు. వారిలో కొంతమంది మళ్ళీ సమ్మె లోకి వచ్చేసారు అని తెలిపాడు. సీఎం డెడ్ లైన్ పై జేఏసీ నేత అశ్వథామ రెడ్డి మాట్లాడుతూ ..ఏ ఒక్క ఆర్టీసీ కార్మికుడు కూడా ఈ డెడ్ లైన్ గురించి బయపడకండి ..మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు. డెడ్ లైన్ పెట్టి సమ్మె ని విచ్చిన్నం చేయాలని చూస్తున్నారు అంటూ చెప్పారు. దీనిపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయని ఈ నెల 7 న సమగ్ర విచారణ జరిగే అవకాశం ఉంది. ఆ రోజు మనకి హైకోర్టు లో తప్పక న్యాయం జరుగుతుంది అని ఎవరు భయపడొద్దు అని తెలిపాడు. ఇకపోతే ఈ నెల 9 న ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్ బండ్ కి పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే.