Begin typing your search above and press return to search.
మెక్ డొనాల్డ్ లో మరీ అంత దారుణమా?
By: Tupaki Desk | 3 March 2017 5:37 AM GMTఈ ముచ్చట వింటే వణికిపోవాల్సిందే. ఇలా కూడా జరుగుతుందా? అని షాక్ తినాల్సిందే. పట్టణ.. నగర ప్రాంతాలకు చెందిన వారికి సుపరిచితం మెక్ డొనాల్డ్. కోల్ కతాలోని మెక్ డొనాల్డ్ శాఖలో చోటు చేసుకున్నఈ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తన కుమార్తెను తీసుకొని ప్రియాంక అనే గృహిణి మెక్ డోనాల్డ్ కు వెళ్లారు. ఫ్రెంచ్ ప్రైస్ ఆర్డర్ ఇచ్చిన వారు.. వాటిని తింటున్న వేళ.. చచ్చిపోయి.. వేగినబల్లి ఒకటి వారి ఫ్రెంచ్ ప్రైస్ లో దర్శనమిచ్చింది.
దీంతో.. షాక్ తిన్న ప్రియాంక.. ఈ దారుణాన్ని మెక్ డోనాల్డ్ సిబ్బంది దృష్టికి తీసుకొచ్చారు. వారు.. పెద్దగా రియాక్ట్ కాకుండా.. సింపుల్ గా సారీ చెప్పి పక్కకు తీసేసే ప్రయత్నం చేశారు. దీంతో.. కోపం నశాళానికి అంటిన ప్రియాంక.. ఇదేం పద్ధతి అంటూ నిలదీశారు. ఫ్రెంచ్ ప్రైస్ తో ఉన్న చచ్చిన బల్లి ఫోటోను తీసుకున్నారు. వెంటనే ఈ విషయాన్ని ఆమె తన భర్తకు తెలియజేశారు.
ఈ ఉదంతంపై మెక్ డోనాల్డ్ ఢిల్లీ.. కోల్ కతా కార్యాలయాల్ని సంప్రదిస్తే.. వారు స్పందించకపోవటంపై ప్రియాంకభర్త విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎదురైన అనుభవాన్ని మెక్ డోనాల్డ్ వారి దృష్టికి తీసుకెళితే.. కనీసం వారు క్షమాపణలు కూడా కోరలేదని ప్రియాంక భర్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదంతంపై తాముకోర్టుకు వెళ్లనున్నట్లు చెబుతున్నారు. మెక్ డోనాల్డ్ ఫుడ్ ను ప్రేమించేవారు.. కాస్తంత జాగ్రత్తగా ఉండాలని బాధితులు కోరుతున్నారు. తప్పు జరిగిన వెంటనే స్పందించి.. అలాంటి తప్పు మరోసారి జరగకుండా చూసుకుంటామని చెబితే.. ఇంత రచ్చ ఉండదు కదా? అయినా.. ఇష్యూను రచ్చ చేసుకోవాల్సిన అవసరం ఉందా..? దీన్ని బట్టి పైకి అందంగా, శుభ్రంగా కనిపించేవన్నీ హైజీన్ గా ఉంటాయన్నది నిజం కాదేమో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/