Begin typing your search above and press return to search.
గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం కాల్చివేత..అసలు విషయం ఇదే!
By: Tupaki Desk | 24 April 2020 1:30 PM GMTతెలంగాణ లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో హైదరాబాద్ రింగురోడ్డు సమీపంలో ఓ మృతదేహాన్ని కాల్చి వేయడం స్థానికంగా కలకలం రేపింది. బుధవారం రాత్రి రింగురోడ్డు సమీపంలోని కోహెడ్ రెవిన్యూ పరిధి దగ్గర ఉన్న గుట్టలలో నుంచి రెండు అంబులెన్సులు రావడాన్ని స్థానికులు గుర్తించారు. వాటిని అడ్డగించి, అందులో ఉన్నవారిని ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది.
దీనితో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ వారి నుంచి వివరాలు సేకరించగా జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలోనే మృతదేహాన్ని కాల్చివేసినట్లు స్పష్టమైంది. కాగా, ఈ విషయం తుర్కయాంజాల్ పురపాలిక ఛైర్ పర్సన్ మల్ రెడ్డి అనురాధ - స్థానిక నాయకులకు తెలియడంతో గురువారం ఉదయం అక్కడకు చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎక్కడి నుంచో తెచ్చిన మృతదేహాలను ఇక్కడ కాల్చడం ఏంటని.. కరోనా సోకి మరణించినవారివైతే ఇక్కడ జనం పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.