Begin typing your search above and press return to search.
ఎన్సీపీ కి డెడ్ లైన్ ఈ రోజు రాత్రి 8.30 గంటలు.. ఏం కానుంది ?
By: Tupaki Desk | 12 Nov 2019 5:28 AM GMTమహా రాష్ట్ర లో రాజకీయం తెలుగు సీరియల్ మాదిరి సాగుతోంది. ఎంతకూ లెక్క తేలని మహా రాజకీయం.. ఈ రోజుతో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటాని కి వరుస క్రమం లో అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలకు వరుస పెట్టి అవకాశం ఇస్తున్న గవర్నర్..తాజా గా 54 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ఎన్సీపీ కి అవకాశం ఇవ్వటం తెలిసిందే. ఎమ్మెల్యేల బలం విషయానికి వస్తే.. మూడో స్థానం లో ఉన్న ఎన్సీపీ కి గవర్నర్ ఈ రోజు రాత్రి (మంగళవారం) రాత్రి 8.30 గంటల వరకూ డెడ్ లైన్ ఇచ్చారు. ఈ లోపు ఏం జరుగుతుంది? డెడ్ లైన్ తర్వాత ఏం జరిగే అవకాశం ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. గవర్నర్ తమకు అవకాశం ఇచ్చి బలాన్ని ప్రదర్శించమని కోరినప్పుడు కాంగ్రెస్ మోకాలడ్డటాన్ని శివసేన జీర్ణించు కోలేక పోవటమే కాదు.. తమకు వచ్చిన అవకాశాన్ని ఆ పార్టీ చెడగొట్టిందన్న కోపం తో ఉండటం ఖాయమంటున్నారు.
ఈ నేపథ్యం లో ఎన్సీపీ కి ఉన్న 54 మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ పార్టీకి ఉన్న 44 మంది ఎమ్మెల్యేల తో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదు. మొత్తం 145 మంది ఎమ్మెల్యే బలం అవసరమైన వేళ.. దాదాపు 47 మంది ఎమ్మెల్యేల బలం అదనం గా అవసరమైనందున ప్రభుత్వ ఏర్పాటు లో శివసేన సహకారం తప్పనిసరి. చిన్న పార్టీలు.. ఇండిపెండెంట్ల మద్దతు తీసుకున్నా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు.
ఈ నేపథ్యం లో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ సంసిద్ధత వ్యక్తం చేయ లేని పరిస్థితి. ఒకవేళ శివసేన పెద్ద మనసు తో ఎన్సీపీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకొస్తే..ఆ నిర్ణయం ఆ పార్టీ ని దారుణం గా దెబ్బ తీయటం ఖాయమని చెప్పక తప్పదు. ఈ నేపథ్యం లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితికి ఎన్సీపీ చేరుతుందని.. దీంతో.. రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడే అవకాశం ఉందంటున్నారు. గవర్నర్ ఇచ్చిన గడువు లోపు ఎన్సీపీ ఏమీ చేయ లేని పరిస్థితి ఉందన్న మాట బలం గా వినిపిస్తోంది.