Begin typing your search above and press return to search.

పెద్ద భవంతులు పేకముక్కల్లా కూలాయి

By:  Tupaki Desk   |   6 Feb 2016 6:38 AM GMT
పెద్ద భవంతులు పేకముక్కల్లా కూలాయి
X
తైవాన్ లో భారీ భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ మీద 6.4గా నమోదైన ఈ ప్రకృతి విలయంతో తైవాన్ లో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. భారీ భవంతులు పేకమేడల్లా కూలిపోయిన పరిస్థితి. తూర్పు ఆసియాలోని ద్వీపదేశమైన తైవాన్ తాజా ప్రకృతి విలయంతో వణికిపోయింది. తైవాన్ ఈశాన్య ప్రాంతంలోని కావోషింగ్ కేంద్రంగా తాజా భూకంపం చోటు చేసుకున్నట్లు గుర్తించారు.

భూమికి 10 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ భూకంపం ధాటికి భారీగా విధ్వంసమే చోటు చేసుకుంది. తాజా భూకంప ప్రభావంతో తైవాన్ నగరంలోని పలు భవంతులు పేకమేడల్లా కూలిపోయాయి. దాదాపు 150కి పైగా ప్రజలు శిధిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటివరకూ 3 మరణించినట్లు తెలుస్తోంది. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

తాజా భూకంపప్రభావంతో తైవాన్ లోని 17 అంతస్తుల నివాస గృహ కాంఫ్లెక్స్ కూలిపోయి.. భారీగా మృత్యువాత పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది. తైవాన్ నగరంలోని పలు భవంతులు భూకంపం ధాటికి భారీగా దెబ్బ తిన్న దుస్థితి.