Begin typing your search above and press return to search.

డెల్టా కంటే ఘోరమైన వైరస్ వేరియంట్ రావచ్చు?

By:  Tupaki Desk   |   7 Aug 2021 8:10 AM GMT
డెల్టా కంటే ఘోరమైన వైరస్ వేరియంట్ రావచ్చు?
X
డెల్టా కంటే మరింత ప్రమాదకర కరోనా వేరియంట్లను అమెరికా చూడవచ్చని అమెరికా వైట్ హౌస్ చీఫ్ మెడికల్ సలహాదారు డాక్టర్ ఆంటోని ఫౌసీ హెచ్చరించారు.ఇది ప్రస్తుతం వేస్తున్న వ్యాక్సిన్ల తో వచ్చిన రక్షణలను కూడా ఉల్లంఘించవచ్చని స్పష్టం చేశాడు.

డెల్టా వేరియంట్ ద్వారా కోవిడ్ కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయని.. రాబోయే వారాల్లో రోజుకు 2,00,000 కేసులు రెట్టింపు కావచ్చు అని మెక్‌క్లాచి డిసి బ్యూరో నివేదించింది. "7 రోజుల సగటు కేసులు చూస్తే సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది" అని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ అధిపతి ఫౌసీ పేర్కొన్నారు. అమెరికాలో దాదాపు 93 మిలియన్ల మంది వ్యక్తులు టీకాలు వేయించుకోవడానికి అర్హత కలిగి ఉన్నారని వారంతా ఈ ఉపద్రవం రాకముందే వేయించుకోవాలని సూచించారు.

డెల్టా వేరియంట్.. ఆల్ఫా వేరియంట్ కంటే పరిమాణంలో 1,000 రెట్లు ఎక్కువ వైరల్ లోడ్ కలిగి ఉంటుందని ఫౌసీ హెచ్చరించాడు. ఇది ఇంకా అధ్వాన్నంగా మారవచ్చని హెచ్చరించాడు. ఎందుకంటే ఇది మరింత ప్రమాదకరమైన జాతిగా మారడానికి తగినంత అవకాశం ఉందని ఫౌసీ హెచ్చరించాడు.

"వ్యాప్తి చెందుతున్న ఈ దశలో జనాభాకు అధిక శాతం వ్యాక్సిన్ వేయాలి. ఇప్పుడే ఈ మహమ్మారిని మనం అణిచివేయకపోతే అప్పుడు ఏమి జరుగుతుందంటే శీతాకాలంలో ఈ వైరస్ మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఇది కొత్త వేరియంట్ గా మారడానికి తగినంత అవకాశాన్ని ఇస్తుంది" యుఎస్ టాప్ అంటు వ్యాధి నిపుణుడు అన్నారు. "డెల్టాను పక్కకు నెట్టే ఒక కొత్త వేరియంట్ పుట్టవచ్చని ఆయన హెచ్చరించాడు. కొత్త వేరియంట్ వచ్చినట్లయితే దాని తీవ్రత సామర్థ్యం కూడా భారీగా పెరుగుతుంది. కానీ మరింత తీవ్రంగా ఉంటుంది. అప్పుడు అమెరికన్లు నిజంగా ఇబ్బందుల్లో పడవచ్చు" అని అతను చెప్పాడు.టీకాలు వేయించుకోవాలని ప్రజలను ప్రోత్సహించాలి. వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తులను గుర్తించి వారికి అందించాలి. మిగతా అందరికి ఇవ్వాలని" అని ఆయన అన్నారు.

యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) ప్రకారం.. గత వారంలో యుఎస్‌లో కోవిడ్ కేసులు 43 శాతం పెరిగాయి. సగటున రోజుకు 94,000 కేసులు నమోదవుతున్నాయి. గత నెలలో యుఎస్‌లోని ఆసుపత్రిలో రోగుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని, సగటున దాదాపు 12,000 నుంచి దాదాపు 43,000 వరకు ఉందని సీడీసీ తెలిపింది.

పెరుగుతున్న అంటువ్యాధులతోపాటు గత రెండు వారాల్లో రోజుకు మరణాలు కూడా 75 శాతం పెరిగాయి. సగటున 244 నుంచి 426కి చేరుకుంది. మొత్తం ధృవీకరించబడిన మరణాల సంఖ్య 614,000 కంటే ఎక్కువగా ఉందని ఏజెన్సీ నివేదించింది.

"కొన్ని నెలల క్రితం, మాకు రోజుకు 10,000 కేసులు ఉన్నాయి" అని ఫౌసీ తెలిపాడు. "100,000 నుంచి 200,000 కేసుల మధ్య కేసులు నమోదు కావచ్చని.. మళ్లీ లాక్ డౌన్ పెట్టే అవకాశం ఉంటుందని ఫౌసీ అభిప్రాయపడ్డారు.

గత నెలలో ఫౌసీ అమెరికా తప్పుడు మార్గంలో వెళుతోందని పేర్కొన్నాడు, కోవిడ్ -19 కేసులు, మరణాలు.. ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. టీకాలు వేయనివారిలో ఈ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో టీకాలు తీుకోకుండా గణనీయంగా హాని కలిగించే వ్యక్తుల సమూహం ప్రమాదకరంగా ఉందని ఆయన అన్నారు.