Begin typing your search above and press return to search.
ఉక్రెయిన్ పై ప్రాణాంతక ఆయుధాలా ?
By: Tupaki Desk | 12 Jun 2022 8:33 AM GMTయుద్ధంలో ఉక్రెయిన్ ను నామరూపాలు చేసేందుకు రష్యా సైన్యాలు ప్రాణాంతక ఆయుధాలను ప్రయోగించబోతోందా ? ఈ విషయంలో బ్రిటన్, అమెరికా ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాంతక ఆయుధాలను ప్రయోగించటం ద్వారా భారీ సామూహిక మరణాలకు రష్యా ప్లాన్ చేసిందంటు పై దేశాలు తీవ్ర ఆందోళన మొదలుపెట్టాయి. 1960ల నాటి యాంటీ షిప్ మిస్సైల్స్ కు అణువార్ హెడ్లను బిగించిన మిస్సైల్స్ ను ప్రయోగించి భారీఎత్తున ప్రాణనష్టం కలిగించేందుకు రష్యా ప్లాన్ చేస్తున్నట్లు బ్రిటన్ ఆరోపణలు మొదలుపెట్టింది.
ఉక్రెయిన్ చుట్టూత రష్యా వార్ షిప్పులను మోహరించి వాటికి అణువార్ హెడ్లు కలిగిన మిస్సైల్స్ ను రెండీ ఉంచిందట. ఏ సమయంలో అయినా వాటిని ప్రయోగించేందుకు రష్యా సైన్యం సిద్ధంగా ఉందని పై దేశాలు ఆందోళన చేస్తున్నాయి. తూర్పు ఉక్రెయిన్లో రష్యా జరిపిన దాడుల్లో చాలామంది సైనికులతో పాటు మామూలు జనాలు కూడా చనిపోయారు. ఇలాంటి దాడులను ప్రతిరోజు చేయాలని రష్యా సైన్యాధికారులు ఇప్పటికే డిసైడ్ చేశారు.
ప్రాణాంతక ఆయుధాలను ప్రయోగిస్తేకానీ వాటి తీవ్రత ఏమిటనేది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఆ ఆయుధాల ప్రభావం ఒక్క ఉక్రెయిన్ మీద మాత్రమే ఉంటుందా లేకపోతే చుట్టుపక్కల దేశాలపైన కూడా పడుతుందా అనే విషయమై టెన్షన్ మొదలైంది.
ఈ సమస్య ఇలాగుంటే మరోవైపు ఉక్రెయిన్లోని కొన్ని ప్రాంతాల్లో కలరా సమస్య పెరిగిపోతోంది. రష్యా ఆయుధాల ప్రయోగందెబ్బకు నీటివనరులు కలుషితం అయిపోతోంది. అలాగే చనిపోయిన వారిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసే యంత్రాంగం లేకపోవటంతో ఆ మృతదేహాలన్నీ కుళ్ళిపోతున్నాయి. దాంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో కలరా వ్యాధి ప్రబలుతోందని ఉక్రెయిన్ వైద్యులు మొత్తుకుంటున్నారు. చాలానగరాల్లో ఎక్కడచూసినా రోడ్లపైనే కుళ్ళిపోయిన వందలాది మృతదేహాలు కనబడుతున్నాయి. చివరకు వీటిని క్లియర్ చేసే యంత్రాంగం కూడా లేకపోయింది. దీంతో అంటువ్యాధులు కూడా పెరిగిపోతున్నాయి. ఈ బాధలు పడలేక ఇప్పటికే లక్షలాదిమంది జనాలు వలసలు వెళ్ళిపోతున్నారు.